Star Hero : పేరుకు స్టార్ హీరో..కానీ తాగుడే తాగుడు..!

టాలీవుడ్ లో అతనొక స్టార్ హీరో. పెద్ద ఫ్యామిలీకి చెందిన వాడే. కానీ అతన్ని ఆ ఫ్యామిలీ పక్కన పెట్టింది. అభిమానులు మాత్రం అండగా నిలబడ్డారు. అతని టాలెంట్ కూడా అతన్ని స్టార్ హోదాలో నిలబెట్టింది. గత కొన్నాళ్లుగా ఇతను చేసిన సినిమాలు అన్నీ కూడా బాగానే ఆడుతున్నాయి. కానీ బ్రేక్ ఈవెన్ అవ్వడం లేదు. అది వేరే విషయం అనుకోండి. అయితే ఇటీవల ఇతను ఓ సినిమాలో నటించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తాజాగా మరో రెండు పెద్ద సినిమాలను కూడా లైన్లో పెట్టాడు. అయితే ఆ సినిమాలు ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. కానీ ఈ గ్యాప్ లో ఆ స్టార్ హీరో ఆ సినిమాలపై దృష్టి పెట్టకుండా తెగ తాగుతున్నాడట. సిగరెట్లు కూడా గ్యాప్ లేకుండా కాలుస్తూనే ఉన్నాడట. 
 
ఇండస్ట్రీలో ఉన్న అతని స్నేహితుల్లో రోజుకి ఒకరిద్దరితో సిట్టింగ్ వేస్తున్నాడని తెలుస్తుంది. ఇతని కాన్ఫిడెన్స్ ఏంటో దర్శకులకి అర్థం కావడం లేదట. గతంలో కూడా  ఈ హీరో ఇలాగే ఎక్కువగా మద్యం సేవించేవాడని, కాని కొంత కాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్లీ ఇప్పుడు తాగడం స్టార్ట్ చేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఆయన ఇటీవల నటించిన మూవీ షూటింగ్ సమయం నుండే మళ్ళీ తాగడం మొదలుపెట్టాడని తెలుస్తుంది. అయితే ఆయన మళ్లీ ఇంతలా తాగడానికి కారణాలు మాత్రం ఎవ్వరికీ తెలియదు. అయితే కొంతమంది చెబుతున్న మాట ఏంటి అంటే.. ఇటీవల ఇతన్ని మద్యం, సిగరెట్ లాంటి వాటికి దూరంగా ఉంచడానికి కుటుంబ సభ్యులు దీక్షలో కూర్చోపెట్టారట. అయితే ఆ దీక్ష ముగిసిన తర్వాత తన అలవాటు మరింత పెరిగిపోయిందని చెబుతున్నారు. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు