SSMB28: ఆగిన కథనే మళ్ళీ మొదలుపెట్టారా.?

త్రివిక్రమ్ శ్రీనివాస్
తెలుగు సినిమా సంభాషణలను కొత్త పుంతలు తొక్కించిన ఈ తరం దర్శకుడు. త్రివిక్రమ్ మాటలు కోసమే థియేటర్ కి వచ్చే ఆడియన్స్ కూడా ఉన్నారు. వేదంతాన్ని సైతం పామరులకు అర్ధమయ్యేలా చెప్పడం త్రివిక్రమ్ శైలి. “స్వయం వరం” సినిమాతో రచయిత గా ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్ మొదటి సినిమాతోనే తన మార్క్ డైలాగ్స్ తో ప్రేక్షకులకు చేరువయ్యారు.

“స్వయం వరం” సినిమాకి ముందు తన స్నేహితుడైన సునీల్ తను నటుడిగా నిలద్రొక్కుకోవడానికి ఆడిషన్స్ కి వెళ్లిన ప్రతిచోటా నా రూమ్ లో మంచి రైటర్ ఉన్నాడు అంటే పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. స్వయంవరం సినిమా రిలీజ్ తరువాత త్రివిక్రమ్ పంజాగుట్ట రూమ్ ముందు చాలామంది నిర్మాతలు త్రివిక్రమ్ కోసం వెయిట్ చెయ్యడమే
త్రివిక్రమ్ సక్సెస్ కి నిదర్శనం.

1999 లో రచయిత గా తన ప్రస్థానం మొదలు పెట్టిన త్రివిక్రమ్ 2002 లోనే “నువ్వే నువ్వే” సినిమాతో దర్శకుడిగా మారిపోయారు.
“నువ్వే నువ్వే” సినిమాకంటే ముందే సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ కి సినిమా ఒకే అయింది. కానీ నేను స్రవంతి రవికిశోర్ గారికి సినిమా చేస్తానని మాట ఇచ్చాను అండి, ఆ సినిమా చేసి వచ్చాక “అతడు” చేద్దామండి అని త్రివిక్రమ్ చెప్పడంతో నువ్వే నువ్వే సినిమా తరువాత అతడు సినిమా స్టార్ట్ అయింది.

- Advertisement -

త్రివిక్రమ్ ఎంతమంది స్టార్స్ తో వర్క్ చేసినా, త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ వేరు, అప్పటివరకు సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేస్తున్న మహేష్ బాబును “ఖలేజా” సినిమాతో ఒక పవర్ఫుల్ ఎనర్జిటిక్ హీరోగా చూపించాడు త్రివిక్రమ్. సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోయినా మహేష్ కెరియర్ లో ఎప్పటికి గుర్తుండిపోయే కేరక్టర్
“రాజు”. మళ్ళీ 12ఏళ్ళ తరువాత ఈ కాంబినేషన్ రీపీట్ అవుతుందంటే అంచనాలు భారీ స్థాయిలోనే ఉంటాయి.

వాస్తవానికి వీరి కాంబినేషన్ ఎప్పుడో జరగాల్సి ఉంది మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కలిసి ‘సైన్యం’ పేరుతో ఓ సినిమా అప్పట్లో ఖరారైంది. భారీ బడ్జెట్‌తో నిర్మాత ఎం.ఎస్‌.రాజు ఈ సినిమాను నిర్మించాలి అనుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. త్రివిక్రమ్‌ అప్పుడు అనుకున్న కథతోనే ఎస్‌ఎస్‌ఎంబీ 28ను హ్యాట్రిక్‌ సినిమాగా తెరకెక్కిస్తున్నారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మహేశ్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రానున్న ఎస్‌ఎస్‌ఎంబీ 28ను చిత్రాన్ని హారిక- హాసిని క్రియేషన్స్ పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు )నిర్మిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు