RAPO20 : రామ్-బోయపాటి సినిమాలో బాలయ్య?

రామ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. కృతి శెట్టి నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్, పోలీస్ గా, డాక్టర్ గా రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడు అని భోగట్టా. జూలై లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ మూవీ తర్వాత రామ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ చిత్రం చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు RAPO20 అనే వర్కింగ్ పనులు జరుపుకుంటుంది. కాగా, ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బోయపాటి తెరకెక్కించే రీజనల్ మూవీస్ కే స్టార్ క్యాస్ట్ ను ఎంపిక చేసుకుంటారు. మరి పాన్ ఇండియా సినిమాకు మామూలుగా ఉంటుందా. ఈ ప్రాజెక్ట్ లో కూడా స్టార్ కాస్టింగ్ తీసుకోవడానికి బోయపాటి రెడీ గా ఉన్నాడని తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ సినిమాలో బాలయ్యను బోయపాటి తీసుకున్నట్టు వార్తలు గత కొద్ది రోజుల నుండి వస్తున్నాయి.

అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. కానీ, ఈ చిత్రంలో బాలయ్య ప్రస్తావన మాత్రం ఉంటుందట. ఈ సినిమాలో బాలయ్య అభిమానిగా హీరో రామ్ కనిపిస్తారట. జై బాలయ్య అంటూ ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తాడు అని తెలుస్తుంది. బాలయ్య పై రెండు మూడు క్రేజీ ఎపిసోడ్లు డిజైన్ చేశాడట బోయపాటి. వీటికి థియేటర్లో రెస్పాన్స్ అదిరిపోతుంది అని వినికిడి. బాలయ్య వల్లే బోయపాటి స్టార్ డైరెక్టర్ అయ్యారనే విషయం అందరికీ తెలుసు. ఆ అభిమానాన్ని ఈ విధంగా ఆయన చూపించబోతున్నాడు అన్నమాట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు