Sri Reddy:పవన్ పై రెచ్చిపోయిన శ్రీ రెడ్డి.. వీడియో వైరల్..!

Sri Reddy:గత కొన్ని సంవత్సరాల క్రితం నటిగా కొన్ని సినిమాలలో నటించి పేరు సంపాదించింది నటి శ్రీరెడ్డి.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ పైన కూడా స్పందిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మెగా కుటుంబానికి శ్రీ రెడ్డికి కొన్నేళ్లుగా పడదని కూడా చెప్పవచ్చు. దీంతో మెగా కుటుంబం పైన ఎప్పుడు విరుచుకుపడుతూ ఉంటుంది.శ్రీరెడ్డి. ఇటీవల పొలిటికల్ పరంగా కూడా యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో కూడా పలు రకాల వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. ఇప్పుడు తాజాగా మరొకసారి పవన్ కళ్యాణ్ పైన పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.. వాటి గురించి చూద్దాం.

వైసిపి శ్రేణులపై దాడులు చేస్తున్నారు..

ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఏళ్ల నుంచి వైసీపీ పార్టీకి మద్దతుగా నిలిచింది శ్రీరెడ్డి.. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా అంటే కూడా వెంటనే స్పందిస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. అలాగే సినీ ఇండస్ట్రీలో కూడా మెగా కుటుంబం పైన నాగబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి మీద విరుచుకుపడుతూ ఉంటుంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో వరుసగా చాలామంది నేతలు వైసిపి పార్టీ కార్యకర్తల పైన దాడులు చేస్తూ ఉన్నారు. దీంతో ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు బయటకు వచ్చి ఇది తప్పని చెప్పడం లేదంటూ ప్రశ్నించింది. అంతేకాకుండా ఒక స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నిస్తోంది.

పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి..

Sri Reddy: Sri Reddy angry with Pawan.. Video viral..!
Sri Reddy: Sri Reddy angry with Pawan.. Video viral..!

పవన్ కళ్యాణ్ కేవలం ఓట్ల కోసమే ప్రజలను మభ్యపెట్టి మరి ఇలాంటి పనులు చేశారని.. ఈరోజు బయటికి వచ్చి అమాయక ప్రజల పైన దాడులు జరుగుతూ ఉంటే ఎందుకు నోరు మెదపలేదంటూ రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ నేతలు అయిన కొడాలి నాని, పేర్ని నాని ఇంటి పైన కూడా టిడిపి నేతలు సైతం దాడులు పాల్పడుతున్నారు.

- Advertisement -

లోకేష్ పై నిప్పులు చెరుగుతున్న శ్రీరెడ్డి…

ఇక లోకేష్ గురించి కూడా మాట్లాడుతూ.. రెడ్ బుక్ లో అందరి పేర్లు రాస్తున్నానని చెప్పి.. వాళ్ల తాటలు తీస్తానంటూ చెప్పి.. లోకేష్ రెచ్చగొట్టి మరీ తమ నేతలను వైసీపీ పార్టీ మీదికి ఉసగొలుపుతున్నారంటూ ఫైర్ అయ్యింది.అంతేకాదు వైసిపి వాళ్లను అమాయకుల్ని చేసి దాడులకు పాల్పడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది శ్రీరెడ్డి.. ఇక ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

శ్రీ రెడ్డి విషయాలు..

ఇక శ్రీరెడ్డి విషయానికి వస్తే సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. తన మాటలతో అందర్నీ టార్గెట్ చేస్తూ ఉంటుంది.. ముఖ్యంగా నాచురల్ స్టార్ నాని పై కామెంట్లు చేస్తూనే మరొకవైపు దగ్గుబాటి రానా సోదరుడు అభిరాం పైన కూడా విమర్శలు చేసింది.. అంతేకాదు తనతో బెడ్ రూమ్ లో వున్నాను అంటూ కూడా ఆమె కామెంట్లు చేసింది.. అంతేకాదు వీరిద్దరికీ సంబంధించిన వాట్సప్ కన్వర్జేషన్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి నానా రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ .. అలాగే తనకు అవకాశాలు కల్పించలేదని.. కొంతమంది తనను వాడుకొని మోసం చేశారని.. అర్ధనగ్న ప్రదర్శన కూడా చేసింది అలా వారి పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఇప్పుడు వైసీపీ పార్టీ తరఫున మాట్లాడుతూ టిడిపి అభ్యర్థులపై మాటల తూటాలు విసురుతోంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు