Sita Ramam Trailer :సీత కోసం రాముడు.. రాముడి కోసం సీత

మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. విలక్షణమైన పాత్రలతో వరుసగా సినిమాలు చేస్తూ అందరినీ మెప్పిస్తున్నాడు. “ఓకే బంగారం” సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన దుల్కర్ “మహానటి” చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం దుల్కర్ నేరుగా తెలుగులో నటించిన చిత్రం “సీతారామం”. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. అందమైన ప్రేమ కథలను తెరకెక్కించడంలో నిష్ణాతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు హను రాఘవపూడి. “పడి పడి లేచే మనసు”, “అందాల రాక్షసి” వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు హాను రాగవపూడి.

ఈ చిత్రంలో హీరోయిన్ గా మృణాల్ థాకూర్ నటిస్తోంది. కాశ్మీర్ ముస్లిం అమ్మాయి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కనిపించబోతుంది. కథను మలుపు తిప్పే పాత్రగా ఉంటుంది. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకం పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా, పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్, గ్లిప్స్ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రం బృందం.

రామ్ రాసిన ఓ ఉత్తరాన్ని సీత వద్దకు చేర్చడానికి రష్మిక మందన్న పడే ఆరాటాన్ని అలాగే ఓ గడువులోపు రామ్ సీత ఎవరు అనేది కనుక్కోవడానికి రష్మిక చేసే ప్రయత్నాన్ని ట్రైలర్లో చిత్ర బృందం తెలిపింది. అలాగే సీత రాసిన ఓ ఉత్తరాన్ని తీసుకొని రామ్ సీత వద్దకు వెళ్లిన సన్నివేశాన్ని కూడా అద్భుతంగా తెరకెక్కించారు. 1964లో జరిగిన ఓ ప్రేమకథగా ఈ చిత్రాన్ని నిర్మించినట్లు ట్రైలర్ లో తెలుస్తోంది. ఈ చిత్రంలో సుమన్ పాత్రను కూడా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ ట్రైలర్ యువకులను విపరీతంగా కట్టుకునే విధంగా ఉంది. కాగా ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు