Sita Ramam: మెస్మరైజింగ్ క్లాస్ నంబర్

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన ‘సీతారామం’ చిత్రం ఆసక్తికరమైన ప్రొమోషనల్ కంటెంట్‌తో భారీ అంచనాలు పెంచుతోంది. ముఖ్యంగా పాటలకు విశేషమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి థర్డ్ సింగిల్ ‘కానున్న కళ్యాణం’ పాట లిరికల్ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ పాట మెస్మరైజింగ్ క్లాస్ నంబర్ గా విన్న వింటనే ఆకట్టుకుంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ పాట మనసుని హత్తుకుంది. అనురాగ్ కులకర్ణి, సిందూరి ఈ పాటని ఆలపించిన విధానం అద్భుతంగా వుంది. లెజండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాటకు అందించిన సాహిత్యం పదికాలాలు గుర్తుపెట్టుకునేలా వుంది
పాట పల్లవిలో వినిపించిన ఈ సాహిత్యం మనసుకి గొప్ప హాయిని నింపేలా అనిపించాయి. అద్భుతమైన లోకేషన్స్ లో చిత్రీకరించిన ఈ పాట చాలా ఆహ్లాదకరంగా వుంది.

ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సీతారామం చిత్రంలో రష్మిక మందన్న కీలక పాత్రలో సర్ప్రైజ్ చేయనున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మగా హీరో సుమంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

- Advertisement -

స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దృశ్య కావ్యంగా తెరకెక్కుతున్న ‘సీతారామం’కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు