Shivani Rajashekar : స్విగ్గీ, జొమాటో వాళ్ళతో శివాని గొడవ..!

రాజశేఖర్ హీరోగా నటించిన ‘శేఖర్’ మూవీ మే 20న విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్లోని దస్పల్లా హోటల్లో ఏర్పాటు చేశారు. ఈ వేడుకని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ వేడుకలో శివాని, శివాత్మిక లు స్టేజి పై ఉన్నప్పుడు యూట్యూబర్ నిఖిల్ తో కొన్ని సరదా ప్రశ్నలు అడిగించారు నిర్వాహకులు.

‘ఇంట్లో ఎవరు బాగా అల్లరి చేస్తారు.. ఎవరు రెడీ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటారు?ఎవరు అమ్మానాన్నలను చిరాకు పెడుతుంటారు? ఎవరు ఫుడ్ మీద ఎక్కువ ఖర్చు పెడతారు?’ వంటి ప్రశ్నలు అడిగాడు.

‘రెడీ అవ్వడంలో శివాని ఎక్కువ టైం తీసుకుంటుంది. రాజశేఖరే తన ఎక్కువగా ఇరిటేట్ చేస్తారు…పిల్లలు కాదు’ అంటూ జీవిత చెప్పుకొచ్చింది. అలాగే ‘ఫుడ్ పై ఎక్కువగా ఖర్చు పెట్టేది శివాని అని, స్విగ్గీ, జొమాటో వాళ్లతో గొడవలు కూడా పెట్టుకుంటుందని.. కొంచెం ఆలస్యమైనా డబ్బులు ఇవ్వదని’ జీవిత చెప్పుకొచ్చింది.తర్వాత శివాని ‘ఇవన్నీ నిన్ను అడిగారా?’ అంటూ జీవితని సీరియస్ గా అనడంతో అక్కడి వాతావరణం సందడిగా మారిపోయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు