Mahesh Babu : పాన్-మసాలా భరించగలదు కానీ బాలీవుడ్ భరించలేదు..!

‘మేజర్’ ట్రైలర్ లాంచ్ వేడుకలో బాలీవుడ్ ఎంట్రీ గురించి మహేష్ బాబు చేసిన కామెంట్స్ పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ‘నేను బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వలేను. బాలీవుడ్ నన్ను భరించలేదు. నాకు టాలీవుడ్లోనే కంఫర్ట్ గా ఉంది. తెలుగు సినిమాలే బాలీవుడ్ వరకు రీచ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. దీని పై బాలీవుడ్ జనాలు పెద్ద ఎత్తున మహేష్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రమోషన్లలో కూడా మహేష్ బాలీవుడ్ పై కొన్ని సెటైర్లు వేసాడు. ముంబై అనేది గాసిప్స్ కు అడ్డా అన్నట్టు విమర్శ చేశాడు మహేష్. మరి అతన్ని, అతని వ్యాఖ్యలను అంత ఈజీగా తీసుకుంటుందా..!

‘కర్మ ఈజ్ ఆ బి*’ అని ఎందుకు అంటారో ఇప్పుడు అందరికీ అర్థమైంది. విషయం ఏంటంటే మహేష్..ఓ పాన్ మసాలా బ్రాండ్ ను ప్రమోట్ చేశాడు. నిజానికి ఇలాంటి ఆఫర్లు వస్తే అల్లు అర్జున్ వంటి వారు తిప్పి కొట్టారు.కానీ మహేష్ మాత్రం ఆ బ్రాండ్ ను కూడా ప్రమోట్ చేస్తున్నాడు.అంతే ఇది సాకుగా దొరికింది కాబట్టి బాలీవుడ్ జనాలు మహేష్ ను ఏకి పారేస్తున్నారు. ‘టాలీవుడ్లో మాకు తెలిసి మహేష్ బాబు ఒక్కడే పాన్ మసాల బ్రాండ్ ప్రమోషన్ యాడ్లో నటిస్తారమో, మిగితా నటీనటులు ఇలాంటి పొగాకు ఉత్పత్తుల్లో నటించడానికి దూరంగా ఉంటారు. మహేష్ బాబు ద్వంద్వ ప్రమాణాలు చాలా బాగున్నాయి’ అంటూ విరుచుకుపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు