SVP: ‘సర్కారు వారి’ ది అత్యాశా.. తెలివితక్కువతనమా..?

మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం ఇటీవల విడుదలైంది. మొదటి రోజు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. జగన్ ను కలిసిన టాలీవుడ్ హీరోల సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి అంటూ మొదటి రోజు ఈ చిత్రంపై ఓ రేంజ్లో ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ ఈ ట్రోల్స్,  కలెక్షన్లుపై ప్రభావం చూపించలేకపోయాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 95 శాతం రికవరీ సాధించింది. అయితే ఈ సినిమాలో ‘మురారి వా’ అనే పాటని జోడించబోతున్నట్టు ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. గత వారం ‘ఎఫ్3’ విడుదల రోజు నుండి ఆ పాట థియేటర్స్ లో కనిపించే అవకాశాలున్నాయని ఓ టాక్ వినిపించింది. 
 
కానీ అలాంటిది ఏమీ జరగలేదు. దీంతో ఇది గాసిప్ గానే మిగిలిపోయింది.అయితే అనూహ్యంగా చిత్ర బృందం నుండి తాజా గా ఓ ప్రకటన వచ్చింది. ‘మురారి వా’ పాట మూవీలో చేర్చుతున్నట్టు ఆ ప్రకటన సారాంశం. కానీ ఈ సమయంలో ’మురారి వా’ పాటని కలపడం వల్ల ఉపయోగం ఏముంటుంది. ‘ఎఫ్3’ దెబ్బకి ‘సర్కారు వారి పాట’ థియేటర్లు తగ్గిపోయాయి. ప్రస్తుతం చాలా తక్కవ స్క్రీన్స్ లో ‘సర్కారు వారి పాట’ రన్ అవుతుంది. సినిమా విడుదలై ఇప్పటికే మూడు వారాలు పూర్తి కావస్తోంది. ఇలాంటి టైంలో ఆ పాటని కలపడం వల్ల కలిసొచ్చేది ఏమీ ఉండదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోనీ మూడో వీకెండ్ కు అయినా, ఆ పాటని కలుపుంటే కాస్త కలెక్షన్లు పెరిగిఉండేవేమో..!

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు