దివంగత నటుడు శ్రీహరి నటించిన ‘శ్రీ మహాలక్ష్మీ’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది హీరోయిన్ పూర్ణ. అయితే ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం ‘సీమటపాకాయ్’ ‘అవును’ చిత్రాలనే చెప్పొచ్చు. ఆ చిత్రాలు బాగానే ఆడినా, ఈమె ఎక్కువ కాలం హీరోయిన్ గా నిలదొక్కుకోలేక పోయింది. ‘లడ్డు బాబు’ ‘జయమ్ము నిశ్చయమ్మురా’ ‘దృశ్యం 2’ తో పాటు ఇటీవల వచ్చిన ‘అఖండ’ సినిమాలోనూ నటించింది. సినిమాల్లో ఈమె పెద్దగా రాణించకపోవడం, అవకాశాలు తక్కువ రావడంతో, బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది. ఇదిలా ఉండగా.. పూర్ణ అసలు పేరు ‘షామ్నా ఖాసీం’ అన్న సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు. ఆమె ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి.
అయితే ఈ భామ పెళ్ళిపీటలెక్కబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా పూర్ణ, తన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలిపింది. యూఏఈ కి చెందిన వ్యాపారవేత్త షనీద్ ఆసిఫ్ అలీతో ఎంగేజ్మెంట్ కూడా అయినట్టు ప్రకటించింది పూర్ణ. ‘ఫ్యామిలీ మెంబెర్స్ బ్లెస్సింగ్స్ తో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. ఇప్పుడు మా బంధం అధికారికం’ అంటూ పూర్ణ తెలియజేసింది. అయితే 2020 లో కూడా పూర్ణ పెళ్లి కుదిరినట్టు వార్తలు వచ్చాయి. అయితే దాని వెనుక కొంతమంది కుట్ర ఉన్నట్టు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దాంతో అప్పుడు ఆమె పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.
With the blessings of family stepping to my next part of life❤️💍 and now it’s official ❤️ pic.twitter.com/v7Qo04t3Ws
— Purnaa (@shamna_kkasim) June 1, 2022