మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మొదటి రోజు డివైడ్ టాక్ ను మూటకట్టుకున్నా.. తొలి వారం బాగానే కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.80 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది. వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో అయితే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యింది.
ఇదిలా ఉండగా.. నిన్న అంటే 8 వ రోజు నుండీ టికెట్ రేట్లు తగ్గాయి. దాంతో నిన్న బుకింగ్స్ బాగా జరిగాయి. 7 వ రోజుతో పోల్చుకుంటే 8 వ రోజున కూడా సమానంగా కలెక్షన్లు నమోదయ్యాయి. 9వ రోజున కూడా బుకింగ్స్ బాగానే ఉన్నాయి. దీంతో రెండో వీకెండ్ ను కూడా ఈ మూవీ బాగానే క్యాష్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది.
మరోపక్క టికెట్ రేట్లు ఎక్కువ పెంచడం వల్ల జరిగే అనర్ధాలు ఈ చిత్రంతో క్లియర్ అయ్యాయి. ఒకవేళ పెంచుకునే ఉద్దేశం ఉన్నా.. తొలి వీకెండ్ కు పెంచుకుని సోమవారం నుండీ నార్మల్ టికెట్ రేట్లని ఫిక్స్ చేస్తే జనాలకి సినిమా అందుబాటులో ఉంటుంది. అందినంత వరకు లాగేద్దాం అని టికెట్ రేట్లు పెంచేస్తే మొదటికే మోసం వచ్చేస్తుంది. ‘సర్కారు వారి పాట’ కి కనుక గత సోమవారం నుండే నార్మల్ టికెట్ రేట్స్ అందుబాటులో ఉంటే ఇంకా మంచిగా కలెక్షన్లు నమోదయ్యి ఉండేవేమో..!