‘బుజ్జిగాడు’ ‘సత్యమేవ జయతే’, ‘దుశ్శాసన’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వంటి చిత్రాలతో తెలుగులో కూడా పాపులారిటీని సంపాదించుకున్న నటి సంజనా గల్రాని. అయితే ఆ సినిమాలు హిట్ అవ్వకపోవడంతో ఇక్కడ ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. కోలీవుడ్, శాండల్ వుడ్ లలో కూడా ఈమె అడుగుపెట్టింది కానీ అక్కడ కూడా ఈమె రాణించింది ఏమీ లేదు. అయితే కొన్నాళ్లుగా ఈమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. శాండల్ వుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో ఈమె అరెస్ట్ అవ్వడం, జైలు శిక్ష అనుభవించడం వంటివి సంజనాని దేశవ్యాప్తంగా పాపులర్ చేసాయి.
అంతేకాదు బెయిల్ పై తిరిగి వచ్చిన వెంటనే ఈమె రహస్య ప్రియుడు అజీజ్ బాషాని పెళ్ళిచేసుకుని ముస్లింగా మారింది. అయితే ఈ విషయాన్ని ఆమె ఆలస్యంగా తెలియజేసింది. తర్వాత ఈమె గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆమెకు డెలివరీ అవ్వడం పండంటి మగబిడ్డకి జన్మనివ్వడం కూడా జరిగింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులకి తెలియజేసింది. మరో విశేషం ఏమిటి అంటే ఆమె చెల్లెలు ప్రముఖ హీరోయిన్ నిక్కీ గల్రాని పెళ్లి కూడా ఇదే రోజున జరగడం. ఆది పినిశెట్టితో నిక్కీ వివాహం ఈరోజు ఘనంగా జరిగింది.