Samuthirakani: సెంటిమెంట్ కొనసాగుతుందా?

ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మాచర్ల నియోజకవర్గం. ఈ చిత్రంలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోండగా, మరో బ్యూటీ కేథరిన్ మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఇదివరకే రిలీజైన మాచర్ల నియోజకవర్గం పాటలకు మంచి స్పందన లభించింది. మాచర్ల నియోజక వర్గం సినిమాలో సముథ్రఖని రాజప్ప అనే ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. నియోజక వర్గంలో ఎలక్షన్స్ లేకుండా ఏకగ్రీవం ఎమ్మెల్యేగా సముథ్రఖని పాత్రను పరిచయం చేస్తూ, సినిమాలోని లుక్‌ని ఆవిష్కరించారు.

సముద్రఖని ఎవరివైపో సీరియస్‌గా చూస్తూ పేపర్‌పై సంతకం చేస్తూ కనిపించాడు. అతని గెటప్ సాంప్రదాయకంగా ఉన్నప్పటికీ, పోస్టర్‌లో అతను వృద్ధుడిగా మరియు భయపెట్టే చూపుతో కనిపిస్తున్నారు. ఇప్పటివరకు సముథ్రఖని తెలుగులో చేసిన ప్రతి సినిమా మంచి హిట్ అయింది. ఆ సెంటిమెంట్ మాచర్ల నియోజకవర్గం సినిమాకి కూడా కలిసివస్తుందేమో వేచి చూడాల్సిందే.

- Advertisement -

అన్ని హంగులతో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న మాచర్ల నియోజక వర్గం ఆగస్ట్ 12న విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు