Samantha : వాయిదాకు కారణం అదేనా ?

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రాల్లో యశోద ఒకటి. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హరి – హరీష్ డైరెక్ట్ చేస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, సంపత్ రాజ్, మురళీ శర్మ ఈ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగుతో పాటు. తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం ఆగష్ట్ 12న విడుదల కాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. అయితే ఇప్పుడు ఈ చిత్రం పోస్ట్ పోన్ కానుంది అని వినికిడి.

నాగ చైతన్య కీలక పాత్రలో బాలీవుడ్ లో లాల్ సింగ్ చద్దా చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 11 వ తేదీనే విడుదల కాబోతుంది. అదే సమయంలో అఖిల్ ఏజెంట్ చిత్రం కూడా రిలీజ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో సమంత, మాజీ భర్త, మరిది చిత్రాలతో పోటీ పడనుంది అంటూ కామెంట్లు మొదలయ్యాయి. కానీ షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో అఖిల్ ఏజెంట్ రేసు నుండి తప్పుకుంది. దాంతో చైసామ్ ల మధ్య గట్టి పోటీ ఉంటుంది అని అనుకున్నారు. కానీ, యశోద చిత్రం కూడా పోస్ట్ పోన్ అయ్యిందని తెలుస్తుంది. ఇందుకు ప్రధాన కారణం నాగ చైతన్య నటించిన థాంక్యూ, లాల్ సింగ్ చద్దా చిత్రాలు వరుసగా రిలీజ్ కావడం వలనే అని వినికిడి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు