Pakka commercial : అలా చూస్తే “పక్కా” లాభాలు ?

గోపీచంద్ దాదాపు 7 ఏళ్ళ తర్వాత సీటీమార్ చిత్రంతో ఓ కమర్షియల్ హిట్ అందుకున్నాడు. అదే జోష్ లో మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే చిత్రం చేశాడు. ఆ చిత్రం రిలీజ్ కు ముందే మంచి హైప్ ను సొంతం చేసుకుంది. దాంతో బిజినెస్ కూడా చాలా బాగా జరిగింది. ఎంత అంటే, పెట్టిన బడ్జెట్ తో పాటు లాభాలు వెనక్కి వేసుకునేంత. టైటిల్ కు తగ్గట్టే ఈ చిత్రాన్ని చాలా కమర్షియల్ గా తీశారు. ఇక్కడ కామెడీ ఉండాలి అంటే కామెడీ ఉంటుంది. ఫైట్స్ పడాలి అంటే ఫైట్స్ పడతాయి. పాట రావాలి అంటే పాట వస్తుంది. బడ్జెట్ కూడా చాలా వరకు వేసుకున్న లెక్కల్లోనే తీసారట. కరోనా కారణంగా కొద్దిగా పెరిగుండొచ్చు అనేది అంచనా.

అయితే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో అంటే డిజిటల్ ప్లస్ శాటిలైట్ ప్లస్ డబ్బింగ్ ప్లస్ ఆడియో ఇలా అన్నీ కలుపుకుని రూ.32 కోట్లకు అమ్మినట్టు తెలుస్తుంది. దాదాపు స్టార్ హీరో సినిమా కలెక్ట్ చేసినట్టే కలెక్ట్ చేసింది. లాభాలు కూడా వచ్చేశాయి. అయితే థియేట్రికల్ రైట్స్ ప్రకారం ఈ చిత్రం రూ 18 కోట్ల షేర్ ను రాబట్టాలి అనేది ట్రేడ్ పండితులు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు