Sai Pallavi: ఆ వివాదంపై స్పందన..!

‘విరాట పర్వం’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో హిందూ పండిట్లను.. ముస్లిమ్స్ హింసించి చంపినట్టు చూపించారు అని.. అయితే ఇక్కడ కూడా ఆవులను బండి పై తీసుకువెళ్తున్న ముస్లింను చితక్కొట్టి… జై శ్రీరామ్ అన్నారు హిందువులు అని ఆమె కామెంట్ చేసింది. అది హింస అనుకుంటే ఇది కూడా హింసే కదా..! మతం పేరుతో చంపడాలు వంటివి చేస్తే మంచి ఎక్కడ ఉంటుందని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కానీ భజరంగ్ దళ్ సభ్యులు టెర్రరిస్టులు.. గోరక్షకులు ఒక్కటే ఎలా అవుతారు అంటూ సాయి పల్లవి పై కేసు పెట్టారు.దీంతో హైకోర్టును ఆశ్రయించింది సాయి పల్లవి. కానీ హైకోర్టు సాయి పల్లవి పిటిషన్ ను కొట్టివేసి ఆమెకు షాక్ ఇచ్చింది.

తాజాగా ఈ విషయంపై సాయి పల్లవి స్పందించింది. తన ‘గార్గి’ సినిమా ఈ శుక్రవారం అంటే జూన్ 15న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఈ విషయం పై స్పందించి క్లారిటీ ఇచ్చింది.’ నేను తెలుగులో మాట్లాడింది అందరూ చూశారు అని.. అది బహుశా హిందీలో వేరేగా అర్థమయ్యి వాళ్ళకి(భజరంగ్ దళ్ సభ్యులకు) రాంగ్ గా కన్వే అయ్యి ఉండవచ్చు అని.. అందుకే వాళ్లకు అర్థమయ్యేలా తన అభిప్రాయాన్ని తెలియజేసినట్టు సాయి పల్లవి తెలియజేసింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన అభిమానులు తనకు అండగా ఉన్నందుకు థాంక్స్ అని కూడా సాయి పల్లవి కృతజ్ఞతలు తెలిపింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు