Sai Pallavi: నచ్చిన పాత్రలే చేస్తా

ఏ ముహూర్తాన దర్శకుడు సుకుమార్… సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అని అన్నాడో కానీ.. నిజంగానే సాయి పల్లవి క్రేజు, తీరు అలాగే ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. సాయి పల్లవి ఇప్పుడు తెలుగు,తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్. ఆమెకి ఉన్న క్రేజ్ ను వాడుకోవాలని అన్ని భాషల్లోని దర్శక నిర్మాతలు తెగ ప్రయత్నిస్తున్నారు. కానీ ఆమె మాత్రం పాత్ర నచ్చితేనే ఓకె చేస్తుంది. తన పాత్ర నచ్చక పోతే ఎంత పెద్ద సినిమా అయినా నొ చెప్పేస్తుంది. పారితోషికం ఎక్కువ ఇస్తాము అని దర్శకనిర్మాతలు బ్రతిమిలాడినా ఈమె తగ్గడం లేదట. ఈ 5 ఏళ్ళ లో ఈమె 5 పెద్ద సినిమాల్లో అవకాశాలు, అలాగే పలు కమర్షియల్ యాడ్స్ లో నటించడానికి నో చెప్పినట్టు తెలుస్తోంది.

తాజాగా విరాట పర్వం సినిమా ఫ్లాప్ అయ్యింది కదా అనే కామెంట్లు ఈమె వద్దకి వచ్చాయట. కీర్తి సురేష్ కూడా మెల్ల మెల్లగా గ్లామర్ బాట పడుతుంది. కమర్షియల్ హీరోయిన్ గా ఎదగాలి అనుకుంటుంది.
సాయి పల్లవి వద్ద ఆమె రిఫరెన్స్ తీసుకొస్తే.. నాకు కుదిరినన్ని రోజులు సినిమాల్లో నటిస్తా, అది కూడా నాకు నచ్చిన పాత్రలే చేస్తా, నాకు అవకాశాలు రాకపోతే డాక్టర్ వృత్తి లో స్థిరపడతా.. లేదంటే మెడికల్ షాప్ పెట్టుకుంటా అంటూ ఈమె తెగేసి చెబుతుందట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు