Razakar Director Satyanarayana : డైరెక్టర్ “రజాకార్”తో టార్గెట్ చేసింది వీళ్లనేనా?

హైదరాబాద్ సంస్థానంలోని రజాకార్ల దురాగతాల గురించిన వాస్తవాలను బయటపెట్టే కథతో రూపొందుతున్న మూవీ “రజాకార్”. రాజకీయ పార్టీల మధ్య గొడవకు దారి తీసిన ఈ మూవీ మార్చ్ 15న రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే తాజాగా డైరెక్టర్ సత్యనారాయణ “రజాకార్” మూవీని అసలు ఎందుకు తీస్తున్నారు అనే విషయాన్ని వెల్లడించారు.

హైదరాబాద్ సంస్థానంలో అమాయక ప్రజలపై నిజాం ప్రభుత్వానికి చెందిన రజాకార్ వ్యవస్థ ఎలాంటి అకృత్యాలకు దారుణాలకు పాల్పడింది అనే అంశంతో తెరకెక్కిన మూవీ “రజాకార్”. టీజర్ తోనే తీవ్ర దుమారం సృష్టించిన ఈ మూవీలో 1947లో జరిగిన దమనకాండను కళ్లకు కట్టినట్టుగా చూపించడానికి డైరెక్టర్ యాటా సత్యనారాయణ రెడీ అవుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇది ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి చేస్తున్న ప్రయత్నమని మండిపడుతున్నారు. ఈ సినిమాకు ప్రముఖ బిజెపి నేతల నుంచి సపోర్ట్ లభిస్తుండడం, మరి కొంతమంది తెలంగాణ రాజకీయ నేతలు వ్యతిరేకంగా మాట్లాడడంతో మూవీ రాజకీయ రంగు పులుముకుంది. ముఖ్యంగా రానున్న ఎలక్షన్స్ నేపథ్యంలో బిజెపి ఈ మూవీని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కానీ డైరెక్టర్ మాత్రం ఇది చరిత్ర అని, దాన్ని వివాదంగా చూడవద్దని చెబుతున్నారు.

మార్చ్ 15న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు డైరెక్టర్ సత్యనారాయణ. ఫిల్మీ ఫైకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో “రజాకార్” మూవీని ఎవరిని టార్గెట్ చేసి తీశారు? అనే విషయాన్ని బయట పెట్టారు. సత్యనారాయణ మాట్లాడుతూ “రజాకార్” మూవీ తెలంగాణ ప్రజల పెయిన్ అని అన్నారు. హైదరాబాద్ సంస్థానంలో 1948 సెప్టెంబర్ 17 కంటే ముందు ఉన్న ప్రతి ఒక్కరి పెయిన్ ఇది, మన పూర్వీకులు, హైదరాబాద్ లో ఉన్న అప్పటి ప్రజల పెయిన్ అంటూ చెప్పుకొచ్చారు. మన దేశానికి ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది కానీ, తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటకకు మాత్రం స్వాతంత్రం అసలు ఎప్పుడు వచ్చిందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని, గతంలో “రజాకార్” టీజర్ లాంచ్ ఈవెంట్లో కూడా డైరెక్టర్ సత్యనారాయణ చెప్పుకొచ్చారు.

- Advertisement -

స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ విషయం తెలియకపోవడంతో స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని, ఎందరో ప్రాణత్యాగం చేశారని, అయితే ఆ పోరాటం చేసిన వారి గురించి ఎవరికీ తెలియలేదని ఆయన అన్నారు. రక్తంతో తడిసిన చరిత్ర అలాగే మట్టిలో కలిసిపోయిందని, చరిత్రను తొక్కేసారని, ఆనాటి సెప్టెంబర్ 17 కథే ఇప్పుడు తన కథా వస్తువుగా మారిందని, ఆరోజు జరిగిన విముక్తి పోరాటం ఆధారంగానే తన సినిమాను తెరకెక్కించానని వివరణ ఇచ్చారు. ఇది మత పోరాటం కాదని, స్వాతంత్ర పోరాటం అని, దీన్ని మతం దృష్టితో కాకుండా పోరాట దృష్టితో, చరిత్రగా చూడాలని ఆయన కోరారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు