Rashmika mandanna: రౌడీ హీరో పెట్ డాగ్ తో రష్మిక.. అర్థం ఏమిటో..?

Rashmika mandanna.. కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా కన్నడ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక మందన్న.. ఆ తర్వాత ఛలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. ఈ సినిమా విజయం సాధించినా.. కమర్షియల్ గా మాత్రం డబ్బులు రాలేదని.. ఈ సినిమా నిర్మాత నాగశౌర్య తల్లి ఉష శ్రీ తెలిపిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో అటు నాగ శౌర్యకు ఇటు రష్మిక కు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తర్వాత ఈమె విజయ్ దేవరకొండ హీరోగా గీతగోవిందం సినిమాలో నటించి మరింత మంచి పేరు సంపాదించుకుంది.. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.

విజయ్ దేవరకొండ – రష్మిక మధ్య సంథింగ్ సంథింగ్..

ఈ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్లో డియర్ కామ్రేడ్ చిత్రం కూడా వచ్చింది. ఇక ఈ రెండు సినిమాలతో వీరిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే వచ్చింది. పలుమార్లు ఈ రూమర్లపై వీరిద్దరూ ఖండించినా.. ఏదో ఒక రకంగా వీరు చేసే చేష్టల వల్ల ఆ రూమర్స్ మరింత బలపడుతూ ఉంటాయి. ఇటీవల వీళ్ళు డైరెక్ట్ గా కలిసినట్టు ఫోటోలు, వీడియోలు పెట్టకపోయినా.. వీరిద్దరూ పెట్టిన ఫోటో లో లొకేషన్స్ మాత్రం మ్యాచ్ అవుతూ ఉండడంతో అభిమానులు, నెటిజన్లు ఆ ఫోటోలకు లింకులు పెడుతూ మరీ వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు..

ఫోటోలు వేరైనా లొకేషన్స్ ఒకటే..

ఇదిలా ఉండగా మరొకవైపు రష్మిక మందన్న షేర్ చేసే ఫోటోలు కూడా వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఇక అసలు విషయంలోకి వెళితే ఇటీవల కాలంలో రష్మిక ఎక్కువగా కుక్కలు, పిల్లులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి రష్మిక షేర్ చేసిన ఫోటోలలో విజయ్ దేవరకొండ కుక్క స్టార్మ్ కూడా ఉండడం గమనార్హం. విజయ్ తన సోషల్ మీడియా ఖాతాలో పలుమార్లు తన పెంపుడు కుక్క స్టార్మ్ తో కలిసి ఫోటోలు షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కుక్కతో రష్మిక ఫోటో షేర్ చేయడంతో మరొకసారి వీరిద్దరి మధ్య బాండింగ్ ఉందనడానికి ఇంతకంటే ప్రూవ్ ఇంకొకటి కావాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికి అయితే రష్మిక షేర్ చేసిన ఈ ఫోటోలు పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి..

- Advertisement -

విజయ్ పెట్ డాగ్ తో రష్మిక ఫోటో వైరల్..

Rashmika mandanna: Rashmika with a rowdy hero's pet dog.. What does it mean..?
Rashmika mandanna: Rashmika with a rowdy hero’s pet dog.. What does it mean..?

ఇకపోతే గతంలో కూడా రష్మిక పలుమార్లు విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే.. అప్పుడప్పుడు విజయ్ దేవరకొండ పెంపుడు కుక్క అయినా స్టార్మ్ తో రష్మిక ఈ ఫోటో తీసుకొని ఉండవచ్చు అని తెలుస్తోంది.. ఇక విజయ్ పెంపుడు కుక్కతో రష్మిక పెట్టిన ఫోటో లేటెస్ట్ అయితే కాదు అని క్లారిటీ ఇస్తున్నారు అభిమానులు.. మొత్తానికైతే ఈ పెంపుడు కుక్క వీరిద్దరి గురించి మాట్లాడేలా చేస్తోంది అని చెప్పడంలో సందేహం లేదు.. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన పెట్ డాగ్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు