Karate Kalyani: హేమా వలలో జబర్దస్త్ వర్ష.. సంచలన కామెంట్స్ వైరల్..!

Karate Kalyani.. బెంగళూరు రేవ్ పార్టీ.. ఎక్కడ చూసినా ఈ పార్టీ గురించే సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇందులో కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొనడం వల్ల పెద్ద ఎత్తున ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. అందులో ముఖ్యంగా హీరో శ్రీకాంత్, జానీ మాస్టర్, హేమా పేర్లు ప్రధమంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు యాంకర్ శ్యామల పేరు కూడా వినిపించగా ఆమె స్పందించి క్లారిటీ ఇచ్చింది.. మరొకవైపు శ్రీకాంత్ కూడా తాను అక్కడికి వెళ్లలేదని ఇంట్లో ఉన్న వీడియోని షేర్ చేసి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు హేమా చిక్కడం పలు అనుమానాలకు దారితీస్తోంది..

ఎన్నో రేవ్ పార్టీల్లో చిక్కింది..

Karate Kalyani: Jabardast Varsha in Hema's net.. Sensational comments viral..!
Karate Kalyani: Jabardast Varsha in Hema’s net.. Sensational comments viral..!

ఇకపోతే ఇటీవల హైదరాబాద్ , గుంటూరు వంటి ప్రదేశాలలో జరిగిన రేవ్ పార్టీలలో హేమా చిక్కి.. ఆ తర్వాత బయటపడ్డ విషయం తెలిసిందే.. కానీ ఇప్పుడు బెంగళూరు రేవు పార్టిలో దొరికిన తర్వాత తాను అక్కడ లేనట్టు పోలీసులతోనే ఫోన్ తీసుకొని ఒక వీడియో షేర్ చేయడంతో ఈ విషయం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అంతేకాదు తాను బిర్యాని వండుతున్నట్లు ఒక వీడియోను కూడా షేర్ చేసి.. తాను హైదరాబాద్లో ఉన్నానని బెంగళూరులో లేను అంటూ కామెంట్లు చేసింది.. అయితే ఈ విషయంపై స్పందించిన బెంగళూరు పోలీసులు తాను బెంగళూరులోనే ఉంది అంటూ సీసీటీవీ ఫుటేజ్ షేర్ చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు ఆమె రక్త నమూనాలను సేకరించి పరిశీలించగా ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ఇక దీంతో పలువురు సెలబ్రిటీలు ఈమె పై విరుచుకుపడుతున్నారు.. ఇక ఈ నేపథ్యంలో ప్రముఖ నటి, ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి తో పాటు కరాటే కళ్యాణి కూడా కామెంట్లు చేశారు.

హేమా అమ్మాయిలను సరఫరా చేస్తుంది..

తాజాగా కరాటే కళ్యాణి ఇటీవల ఒక ప్రముఖ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. హేమా అంటేనే ఒక ఫేక్ అంటూ సంచలన కామెంట్లు చేసింది.. మరొకవైపు ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి కూడా ‘హేమక్క బ్రతుకు అలాంటిది.. ఆమె డబ్బు కోసం అమ్మాయిలను ఎరగవేసి కోట్లు సంపాదిస్తోంది ‘.. అంటూ కామెంట్ చేసింది. ఇక వీరిద్దరు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా. ఇప్పుడు హేమాకు సంబంధించిన మరొక విషయాన్ని బయట పెట్టింది కరాటే కళ్యాణి.. హేమా గతంలో ఏం చేసింది అనే దానిపై అనేక అనుమానాలు వున్నాయని.. వాటిని వ్యక్తపరుస్తూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది కరాటే కళ్యాణి..

- Advertisement -

ఈమె వలలో జబర్దస్త్ వర్ష కూడా..

కళ్యాణి మాట్లాడుతూ..హేమా చాలా మందిని మిస్ లీడ్ చేస్తూ ఉంటుంది. ఆమె ఈ రేవ్ పార్టీ ఇష్యూ లోనే కాదు గతంలో కూడా ఎన్నో విషయాలు ఇలాగే జరిగాయి. కొంతమంది అమ్మాయిలు ఈమె దగ్గర ఉంటారు. వాళ్ళ ఫోటోలను గ్రూప్లలో షేర్ చేస్తూ ఉంటుంది.. దానికి నేనే సాక్ష్యం.. గతంలో ఒకసారి ఏమైందంటే జబర్దస్త్ అమ్మాయి వర్ష ఫోటో ని ఆమె ‘మా’ గ్రూప్లో పెట్టింది. అప్పుడు నరేష్ గారు మా అధ్యక్షుడిగా ఉన్నారు.. ఆ టైంలో జబర్దస్త్ వర్ష ఫోటోని గ్రూపులో పెట్టింది. హేమా ఏంటి ?ఈ ఫోటో ఎందుకు పెట్టింది ?అని చాలా మంది అడిగాము.. వెంటనే డిలీట్ చేసింది.. అసలు ఆమె ఆ ఫోటో ఎందుకు పెట్టింది అనే సందేహం మాకు కలిగింది.. ఎందుకు పెట్టావ్ అని అడిగితే ఎవరికో పెట్టబోయేది మీకు పెట్టేసానని తెలిపిందట . ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ దొరికిపోతూ ఉంటుంది కానీ ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తూ ఉంటుంది. అసలు వర్ష ఫోటో ఈమె దగ్గర ఎందుకు ఉంది ? అది ఎవరికి పంపాలని అనుకుంది? గ్రూప్లో ఎందుకు పెట్టింది? ఇలా మాకు ఎన్నో అనుమానాలు డౌట్లు వచ్చాయి అప్పుడు హేమ మాత్రం తప్పించుకుంది ..కానీ ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోలేదు ..ఎందుకంటే ఇది చిన్న కేసు కాదు కదా అంటూ అసలు విషయాన్నీ తెలిపింది కరాటే కళ్యాణి.. మొత్తానికి అయితే కరాటే కళ్యాణి చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు