Animal Collections: రెండో రోజు… ఊచకోత కోస్తున్న రణబీర్..!!

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన మేనియా తో తెరకెక్కించిన మరో బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్.. ఇందులో హీరోగా రణబీర్ కపూర్ నటించగా.. హీరోయిన్ గా రష్మిక నటించింది. అలాగే కీలకమైన పాత్రలో త్రిప్తి దిమ్రి తన అద్భుతమైన నటనతో బోల్డ్ సన్నివేశాలతో రష్మిక కంటే మరింత పాపులారిటీ సంపాదించుకుంది. డిసెంబర్ ఒకటవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మొదటి రోజు రూ.116 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఈ ఏడాది టాప్ గ్రాసర్ కలెక్షన్లలో ఒకటిగా నిలిచింది.

ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా మేనియా నుంచి బయటికి రావడం లేదు. ఇందులో రణబీర్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని.. ఇందులో సన్నివేశాలు మరింత అద్భుతంగా ఉన్నాయని తెలియజేస్తున్నారు. సినిమా విడుదలైన మొదటి షో నుంచి యానిమల్ సినిమా హౌస్ ఫుల్ బోర్డుతో రన్ అవుతోంది.. యానిమల్ సినిమా మొదటి రోజు కంటే రెండవ రోజు , మూడవరోజు మరింత కలెక్షన్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. దాదాపుగా మొదటి రోజు కంటే రెండో రోజు భారీ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.

Ranbir Kapoor's Animal Movie Collections
Ranbir Kapoor’s Animal Movie Collections

ఇక రెండో రోజుకి వచ్చేసరికి యానిమల్ సినిమా దాదాపుగా రూ.236 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు ఆదివారం కనుక మరింత కలెక్షన్స్ వసూల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా బుకింగ్స్ తో సండే రోజు కూడా పూర్తిగా హౌస్ఫుల్ బోర్డుతో నిండిపోతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఈరోజు కూడా భారీ మొత్తంలో కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ఈరోజుతో బ్రేక్ ఈవెన్ మార్కును కూడా రీచ్ అవుతుందని సమాచారం.

- Advertisement -

ఓవరాల్ గా యానిమల్ సినిమా రణబీర్ కపూర్ కెరియర్ లోనే ఒక బిగ్గెస్ట్ మూవీగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. దాదాపుగా 350 కోట్ల రూపాయలు రాబట్టిన సంజు సినిమా… రణబీర్ కపూర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఇప్పుడు అలాంటి రికార్డులు అన్నిటిని సైతం యానిమల్ సినిమా చెరిపేస్తుంది అంటూ బుకింగ్ ట్రేడ్స్ తెలియజేస్తూ ఉన్నారు. మరో వారం రోజులలోపే సంజు కలెక్షన్స్ సైతం బ్రేక్ చేసి యానిమల్ సినిమాతో సరికొత్త రికార్డును సైతం సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు ఎలాంటి రికార్డులను తిరగ రాస్తారో చూడాలి మరి.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు