Ram Pothineni: మార్కెట్ పరిధి దాటి ?

రామ్ పోతినేని, మిడ్ రేంజ్ హీరోల్లో టాప్ లో ఉంటాడు. హాలో గురు ప్రేమ కోసమే వరకు రామ్ మంచి సక్సెస్ ను అందుకున్నాడు. దీని తర్వాత వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కెరీర్ లోనే పెద్ద విజయాన్ని అందించింది. అంతే కాకుండా, రామ్ కు ఉన్న 20 కోట్ల మార్కెట్ ను 40 కోట్లకు చేరింది. ఈ సినిమా తర్వాత రామ్ తో సినిమా తీసి లాభాలు పొందాలి అనుకునే నిర్మాతలు రూ.40 కోట్ల బడ్జెట్ లో ప్లాన్ చేసుకోవాలి. కానీ, రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వారియర్ చిత్రానికి రూ.65 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారట. ఇది తెలుగుతో పాటు తమిళంలో కూడా తెరకెక్కిన మూవీ.

పైగా కోవిడ్ కారణంగా అన్ని సినిమాల బడ్జెట్ లు పెరిగాయి. ఇందుకు రామ్ సినిమా మినహాయింపు ఏమీ కాదు. అయితే ఇప్పటివరకు రామ్ చిత్రాలకి రూ.20 కోట్ల వరకు మాత్రమే థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పుడు వారియర్ కు మాత్రం రూ.40 కోట్ల వరకు జరగాలి అని తెలుస్తుంది. ఈ టైంలో అది సాధ్య పడుతుందో లేదో చూడాలి.

ఎందుకంటే ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్ కు రావడం తగ్గించారు. కాబట్టి బయ్యర్స్ మిడ్ రేంజ్ సినిమాలను ఎక్కువ రేట్లు కొనుగోలు చేయడానికి రిస్క్ అని భావిస్తున్నారు. దీంతో ది వారియర్ సినిమాకు రామ్ మార్కెట్ పరిధి దాటి బడ్జెట్ పెట్టారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు