Bandla Ganesh : మళ్లీ పప్పులో కాలు !

బండ్ల గణేష్ స్పీచ్ లకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మనసులో ఏది ఉంటే అది మాట్లాడేస్తాడు . అంటూ ప్రశంసిస్తూ ఉంటారు. బండ్ల వాక్చాతుర్యానికి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు సైతం పలు సందర్భాల్లో ఫిదా అయిపోయారు. సినిమా వేడుకలకు కావాలని బండ్ల గణేష్ పిలిపించి, స్పీచ్ ఇప్పించే వారు అని భోగట్టా. ఆ విషయం పక్కన పెట్టేస్తే బండ్ల గణేష్ కు కాస్త తొందరపాటు ఎక్కువ. ముందు వెనుక ఆలోచించకుండా ఏది పడితే అది అనేస్తూ ఉంటాడు. ట్వీట్ లు వేస్తున్నప్పుడు కూడా ఇదే తీరు. దీని వల్ల బండ్ల చాలా సార్లు ఇబ్బందుల్లో పడ్డాడు.

ఇటీవల టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరోసారి తండ్రి అయ్యాడు. దిల్ రాజు రెండో భార్య తేజస్విని కి మగబిడ్డ పుట్టాడు. దీంతో కొంత మంది సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పనిలో పనిగా బండ్ల గణేష్ తన చేతికి పని చేప్పాడు. దిల్ రాజు కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ట్వీట్ వేశాడు. కాకపోతే ‘SVC official’ అని కాకుండా, ‘SVCC ‘ అని ట్యాగ్ చేశాడు.
ఇక్కడే మొదలైంది అసలు సమస్య. SVC official అనేది దిల్ రాజు నిర్మాణ సంస్థ. SVCC అనేది బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాణ సంస్థ. ఇది గ్రహించిన నెటిజన్లు బండ్ల పై ట్రోల్స్ విపరీతంగా చేశారు. దిల్ రాజు తండ్రి అయితే ప్రసాద్ ను విష్ చేయడం ఏంటి. అంటూ నెటిజన్లు బండ్ల గణేష్ ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు