Ramcharan: ఉపాసన నా భార్య కావడం వల్లే గుర్తింపు లేదు.!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి స్టార్ కపుల్స్ లో బెస్ట్ కపుల్ గా రామ్ చరణ్ – ఉపాసన జంట పేరు దక్కించుకుంది. వీరిద్దరూ 2012లో ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు.. వివాహమైన 11 సంవత్సరాలకు వీరికి పాప జన్మించింది.. వివాహమైన తర్వాత అటు రామ్ చరణ్, ఇటు ఉపాసన పైన చాలా దారుణమైన ట్రోల్స్ కూడా వినిపించాయి.. అయినా కూడా వాటన్నిటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు.. ప్రస్తుతం క్లింకార రాకతో మెగా ఫ్యామిలీ లో ఆనందానికి కొదవ లేకుండా పోయింది. ఇప్పటివరకు క్లింకార కు సంబంధించి పూర్తి ఫేస్ ను మాత్రం రివీల్ చేయలేదు.. దీంతో మెగా అభిమానుల సైతం కాస్త నిరుత్సాహంతో ఉన్నారు.

ఇంటర్వ్యూలో ఉపాసన పై చెర్రీ కామెంట్స్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రామ్ చరణ్ , ఉపాసన ఒక ఇంటర్వ్యూకు హాజరై పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.. ముఖ్యంగా రామ్ చరణ్ మాట్లాడుతూ..నా భార్య కావడం వల్ల ఉపాసనకు సరైన గుర్తింపు రాలేదు.. ఉపాసన నాకు ఒక మంచి భార్య.. తను చేసిన ఎన్నో మంచి పనుల వల్లే ఆమె ఈ స్థాయిలో ఉన్నదంటూ తెలియజేశారు.. పలు రంగాలలో ఉపాసన తనదైన ముద్ర వేసుకుందంటూ తెలియజేయడమే కాకుండా వాటితో పాటు కుటుంబానికి కూడా ఎంతో వాల్యూ ఇస్తుందంటూ తెలియజేశారు రామ్ చరణ్..

భార్యను పొగడ్తలతో ముంచేసిన చరణ్..
కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఉపాసన నా రాక్ స్టార్ అంటూ తెలియజేశారు.. తన భార్య ఉపాసన చేసేటువంటి పనిని తాను ఎప్పుడు చేయలేనని.. తాను తనకంటూ ఒక సొంత మార్గాన్ని సృష్టించుకుంటుందంటూ రామ్ చరణ్ ఉపాసనను పొగడ్తలతో ముంచేశారు.. ఉపాసన కూడా ఈ విషయాల పై మాట్లాడుతూ.. రామ్ చరణ్ కు నీడలా ఉంటున్నందుకు తాను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటానని.. వివాహం అయ్యాక వేరే ప్రపంచానికి వచ్చినట్టుగా అనిపిస్తోందని తెలిపింది..

- Advertisement -

రామ్ చరణ్ పై ఫ్యాన్స్ కామెంట్స్..
ముఖ్యంగా ఉపాసన కుటుంబం, చరణ్ కుటుంబం చాలా డిఫరెంట్ కుటుంబ నేపథ్యాలు కలిగి ఉన్నాయి ..అయినప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.. మా అమ్మవాళ్ళను తాతయ్య ఆత్మవిశ్వాసంతోనే పెంచారు నా కుటుంబంలోని మహిళలు నా జీవితంలో ముఖ్యపాత్ర పోషించారంటూ వెల్లడించింది ఉపాసన.. ఏది ఏమైనా ఇలా ఇద్దరూ ఒకరి మీద ఒకరికి తమకు ఉన్న అభిప్రాయాన్ని తెలియజేయడంతో మెగా అభిమానుల సైతం తెగ సంబరపడిపోతున్నారు.. ముఖ్యంగా రామ్ చరణ్ ఎలాంటి మొహమాటం లేకుండా ఉపాసనను పొగిడేయడంతో అన్నా మీరు రియల్ హీరో అంటూ అభిమానులు రామ్ చరణ్ పైన కామెంట్స్ చేస్తున్నారు..

రామ్ చరణ్ సినిమాలు..
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్న రామ్ చరణ్ ఈ సినిమా పూర్తయిన వెంటనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తన 16వ సినిమాని తెరకెక్కించబోతున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు