టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈమె గ్లామర్ బొమ్మకాదు, డ్యూయెట్ లాక్ పరిమితమైన నటి కాదు, వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రయోగాలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈమె నటించి విడుదలైన ఛత్రివాలీ, ఇందుకు చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు. కండోమ్ టెస్టర్ పాత్రలో నటించి తాను ఏమిటో నిరూపించుకున్న ఈ ముద్దుగుమ్మకు పెళ్లి అయిపోయినట్టు గత కొద్ది నెలలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
నిర్మాత జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఆయన్ని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. గతేడాది నుంచి ఈ ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఎట్టకేలకు తన పెళ్లి రూమర్లపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. ఈ పెళ్లి వార్తలను ఖండించిన రకుల్ నాకు గత నవంబర్ లోనే పెళ్లి అయిపోయింది గా అంటూ జోక్ చేశారు.
ఈ మేరకు హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. రకుల్ ప్రీత్ సింగ్ నవంబర్ లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని గతేడాది అక్టోబర్ లో మొదటిసారి ప్రచారం జరిగింది. ఆ రూమర్లను రకుల్ కొట్టి పారేయడంతో కొత్త రూమర్లు పుట్టుకొచ్చాయి. 2023లో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోబోతున్నారని ఆమె సోదరుడు స్వయంగా వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి. అప్పుడే రకుల్ తన సోదరుడిని ట్విట్టర్ ద్వారా సరదాగా ప్రశ్నించారు. నా వ్యక్తిగత జీవితంలో జరిగే విషయాల గురించి తెలుసుకుంటున్న ఆఖరి వ్యక్తిని తానేనని వెటకారంగా ట్వీట్ చేశారు రకుల్.
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News