Raj Tarun: తేడా కొడితే మూట ముల్లె సర్దేసుకోవాల్సిందే!

పక్కింటి అబ్బాయిలా కనిపించే టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్. “ఉయ్యాల జంపాల” మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు ఈ హీరో. మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ డం సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవడంతో ప్రస్తుతం ఈ హీరో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం రాజ్ తరుణ్ చేతిలో ఉన్న ఒకే ఒక్క మూవీ “నా సామి రంగ”. ఈ మూవీ గనక తేడా కొట్టింది అంటే రాజ్ తరుణ్ ఇక మూట ముల్లే సర్దేసుకొని టాలీవుడ్ నుంచి తప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

“ఉయ్యాల జంపాల” మూవీ తర్వాత “సినిమా చూపిస్త మావా”, “కుమారి 21ఎఫ్” సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూడు సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్ అందుకోవడంతో చిన్న సినిమాల నిర్మాతలకు బెస్ట్ ఛాయిస్ గా మారాడు రాజ్ తరుణ్. కానీ ఆ తర్వాత ఈ హీరో నటించిన సినిమాలు ఈడో రకం ఆడో రకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఒరేయ్ బుజ్జిగా, అందగాడు వంటి కమర్షియల్ సినిమాలు చేసి రెగ్యులర్ మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకోవడానికి గట్టిగానే ప్రయత్నించాడు. కానీ అవేవీ సక్సెస్ కాకపోవడంతో పాటుగా తన మార్కెట్ ను పూర్తిగా కోల్పోయాడు ఈ హీరో. అవకాశాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఓటీటి వైపు అడుగు లేసాడు. “అహ నా పెళ్ళంట” అనే వెబ్ సిరీస్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ అది కూడా ఈ హీరో కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. ఇక ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న “నా సామి రంగ” మూవీలో మూడో హీరోగా నటిస్తున్నాడు.

“నా సామి రంగ” మూవీలో నాగార్జున హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మరో హీరోగా అల్లరి నరేష్ కనిపించబోతున్నాడు. కాబట్టి ఈ మూవీలో రాజ్ తరుణ్ రోల్ దాదాపుగా సపోర్టింగ్ రోల్ అని చెప్పొచ్చు. కానీ ఒక హీరో ఇలా సపోర్టింగ్ రోల్ లో కనిపించడానికి నిజానికి భయపడతారు. ఆ తర్వాత అన్ని ఇలాంటి రోల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం టాలీవుడ్ రాజ్ తరుణ్ కు అదృష్టం కలిసి రాకపోవడంతో ఇలాంటి డేరింగ్ స్టెప్ తీసుకోక తప్పలేదు ఈ హీరోకు. ఈ మూవీనే నటుడిగా తన సత్తా చాటడానికి రాజ్ తరుణ్ కు చివరి అవకాశం అవుతుంది. మరి “నా సామి రంగ” మూవీతో రాజ్ తరుణ్ మళ్లీ గెట్ బ్యాక్ అవుతాడా? లేదంటే ఈ హీరో అసలు ఉన్నాడన్న విషయం కూడా టాలీవుడ్ మరిచిపోతుంది. మరి “నా సామి రంగ” మూవీ రాజ్ తరుణ్ కెరీర్ ను నిలబెడుతుందా అనేది వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు