Raashi Khanna: థాంక్యూ పైనే ఆశలన్నీ

ఒకప్పుడు ఒక హీరో నుంచి సంవత్సరానికి రెండు, మూడు సినిమాలు రిలీజ్ అయ్యేవి. క్రమేపి అది కూడా మారుతూ ఇప్పుడు రెండు సంవత్సరాలకు ఒక సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి. అలానే చాలా మంది స్టార్ హీరోయిన్ల బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విడుదల కావడం లేదు. కానీ రాశీఖన్నా విషయంలో అలా జరగడం లేదు, తన గత చిత్రం విడుదలై నెల కాకముందే మరో చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మధ్యకాలంలో రాశిఖన్నా కు సరైన హిట్ సినిమా పడలేదు అనేది వాస్తవం. మంచి అంచనాలు మధ్య వచ్చిన పక్కా కమర్షియల్ కూడా అంతంత మాత్రంగానే ఆడింది. రాశీఖన్నా ఇప్పుడు తన టాలెంట్ ను నిరూపించుకోవడానికి ఈ ఏడాది రెండో అవకాశం దక్కించుకుంది. నాగ చైతన్య సరసన నటించిన “థాంక్యూ” ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇంతకు ముందు బాక్సాఫీస్ వద్ద “మనం” లాంటి హిట్ సినిమాను అందించిన విక్రమ్ కె కుమార్ థాంక్యూ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు, ట్రైలర్ కు మంచి స్పందన లభించింది.ప్రస్తుతం రాశీఖన్నా కు థాంక్యూ చిత్రంపై చాలా ఆశలు ఉన్నాయి. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తే, రాశీ కు మరిన్ని అవకాశాలు వస్తాయి అనేది చాలామంది అభిప్రాయం.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు