KoratalaShiva : జస్టిస్ ఫర్ కొరటాల శివ

కొరటాల శివ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్. శివ ఏ సినిమా తెరకెక్కించినా, అది బ్లాక్ బస్టర్ హిట్. కొరటాల దర్శకత్వంలో సినిమా చేసే హీరోకు ఒక రకమైన రిలీఫ్. సినిమా ఎలా అయినా, సూపర్ హిట్ అవుతుందని. నిర్మాతలకు కూడా టెన్సన్ ఉండదు. పెట్టిన బడ్జెట్ కంటే, లాభాలు భారీగా వస్తాయని. ఇది అంతా ఆచార్య ముందు వరకు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి స్టార్లు నటించినా, ఈ సినిమా పెద్ద డిజాస్టార్ గా మారింది. కొరటాల శివ కెరీర్ లో మొదటి ఫ్లాప్ గా నిలిచింది.

ఆచార్య సినిమా డిజాస్టార్ కు కారణాలు ఎన్ని ఉన్నా, దాని ప్రభావం మాత్రం కొరటాల శివపైనే పడింది. సినిమా విడుదలకు ముందు జరిగిన బిజినెస్ వల్ల నిర్మాతలు కాస్త సేఫ్ అయ్యారు. కానీ, బయ్యర్లు మాత్రం దారుణంగా నష్టపోయారు. దీంతో తమను ఆదుకోవాలని నిర్మాతలు మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ వద్ద బయ్యర్లు మొర పెట్టుకున్నారు. అయినా, ఫలితం దక్కలేదు.

నిజానికి ఆచార్య సినిమాను బయ్యర్లు తీసుకోవడానికి కారణం, బయ్యర్లుకు డైరెక్టర్ కు ఉన్న సన్నిహిత్యం, కొరటాల సక్సెస్ రేటు అని చెప్పొచ్చు. దీంతో బయ్యర్లకు వచ్చిన నష్టాన్ని కొరటాల శివ తీర్చాల్సి వచ్చింది. ఇటీవల బయ్యర్లుకు కొరటాల డబ్బులు ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి.

- Advertisement -

ఈ వార్తలు బయటకు రావడంతో ట్విట్టర్ లో కొరటాల శివకు నెటిజన్లు భారీగా మద్దతు ఇస్తున్నారు. సినిమా డిజాస్టార్ కావడానికి కారణం డైరెక్టర్ కాకపోయినా, నష్టాలను భరిస్తున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. కొరటాలకు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

#JusticeForKoratalaShiva అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ లోకి తీసుకువచ్చారు. ఈ హ్యాష్ ట్యాగ్ తో ప్రస్తుతం వేల సంఖ్యలో ట్వీట్స్ వస్తున్నాయి. చిరంజీవి, రామ్ చరణ్ పై ట్రోల్స్ కూడా వస్తున్నాయి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు