Carry On Jatta3: పంజాబీ ఇండస్ట్రీ హిట్ వంద కోట్ల వైపు పరుగులు..

ఇండియా లో అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇప్పుడు మంచి సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కడా తగ్గకుండా హై క్వాలిటీతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఫలితంగా ఆ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. మొన్న వచ్చిన 2018 మూవీ అలాంటిదే. చిన్న సినిమా గా వచ్చిన ఆ సినిమా మలయాళం లో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటూ ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయి కూర్చుంది. ఇప్పుడు అలాగే ఒక పంజాబీ సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి మెల్లిమెల్లిగా గ్రోత్ ని పెంచుకుంటూ ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయిపొయింది ఆ సినిమా.

సాధారణంగా పంజాబీ చిత్ర పరిశ్రమ చాలా చిన్నది. చిన్న బడ్జెట్ తోనే అక్కడ సినిమాలు రూపొందుతాయి. అయితే మారుతున్న కాలానికనుగుణంగా ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల్లోనూ మంచి బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారు. ముఖ్యంగా వాటిని మార్కెటింగ్ చేయడంలోనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇదే స్ట్రాటజీ ని అన్ని ఇండస్ట్రీలతో పాటు పంజాబీ ఇండస్ట్రీ కూడా ఫాలో అయి సక్సెస్ అయింది.

క్యారీ ఆన్ జట్ట సిరీస్ లో భాగంగా వచ్చిన లేటెస్ట్ పంజాబీ మూవీ “క్యారీ ఆన్ జట్ట3” అక్కడ భారీ కలెక్షన్లను కొల్లగొడుతుంది. జూన్29న విడుదలైన ఆ సినిమా కేవలం 13 రోజుల్లోనే పంజాబ్ లో 34కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇండియా వైడ్ గా 43 కోట్ల కి పైగా కలెక్షను రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో బాలీవుడ్ సినిమాల రేంజ్ లో 41కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా 84కోట్లకి పైగా కలెక్షన్లు సాధించి కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచి, 100కోట్ల దిశగా దూసుకుపోతుంది. కానీ ఓవర్సీస్ లో ఇంతకు ముందు వచ్చిన పంజాబీ మూవీ చల్ మేరె ఫట్ కి దూరంగానే ఉంది. కానీ లాంగ్ రన్ లో బ్రేక్ చేయడం గ్యారెంటీ.

- Advertisement -

ఇక ఈ ఏడాది ముందుగా హిందీలో కొత్త ఇండస్ట్రీ హిట్ గా “పఠాన్” సినిమా నిలవగా, రీసెంట్ గా మలయాళం లో 2018 సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. తాజాగా ఇప్పుడు పంజాబీ మూవీ క్యారీ ఆన్ జట్ట3 మూవీ కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా ఒకే ఏడాదిలో మూడు భాషల సినిమాలు ఇండస్ట్రీ హిట్ కావడం విశేషమని చెప్పాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు