Prabhas: అభిమానుల అసహనం

ఇండస్ట్రీలో ఉన్న తారాగణమంతా దివినుంచి దిగిరాలేదు.
ప్రేక్షక అభిమానులే చాలామందిని స్టార్ హీరోలను చేసారు.
ఆ స్టార్ హీరోలు తమ అభిమానులను ఎంతవరకు పట్టించుకుంటున్నారు అంటే దానికి సమాధానం దొరకడం కష్టం.
కేవలం ఆడియో ఫంక్షన్స్ అప్పుడు మాత్రమే కనిపించి కొన్ని మాటలు మాట్లాడితే అభిమానులు సంతృప్తి పడతారా.? పైగా ఇప్పుడు సవంత్సరానికి రెండు మూడు సినిమాలు రావట్లేదు. రెండు మూడు ఏళ్ళకు ఒక సినిమా వస్తుంది. అప్పటివరకు అభిమానులకు కళ్ళు కాయలు కాచేలా వేచి చూడాలి.

ప్రస్తుతం ఇండస్ట్రీ లో అందరిచేత డార్లింగ్ అనిపించుకున్న స్టార్ హీరో ప్రభాస్. డార్లింగ్ కు వ్యక్తిగానే గానే కాకుండా వ్యక్తిత్వంలో కూడా మంచి పేరు ఉంది. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చినా కూడా గతంలో తను పనిచేసిన నటీనటులకు అంతే గౌరవాన్ని ఇస్తారు.

కానీ డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం కొద్దిపాటి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వరుస సినిమాలు జరుగుతున్న తరుణంలో కూడా వాటి అప్డేట్స్ రాకపోవడం. తన అభిమానులతో ఫోటో షూట్స్ జరగకపోవడం. ఇలాంటివి డార్లింగ్ అభిమానులకి కొద్దిపాటి అసంతృప్తిని కలుగజేస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా హీరోలు తమ అభిమానులను, అభిమాన సంఘాలను పట్టించుకున్నట్లు ప్రభాస్ తమ అభిమానులను పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళ అభిప్రాయం. అభిమానులు ఎలా అయినా ప్రభాస్ ను కలవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు