NTR30 : మరింత సమయం ?

టాలీవుడ్ లో ప్రస్తుతం మాస్ ఫాలోయింగ్ ఉన్న అతి తక్కువ హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. కెరీర్ ప్రారంభంలో శరీరాకృతి వల్ల సినిమాలు హిట్ అయినా, ఫ్యాన్ బేస్ పెద్దగా రాలేదు. కానీ, టెంపర్ సినిమా తర్వాత తారక్ కెరీర్ మారిపోయింది. టెంపర్ తర్వాత వచ్చిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో సౌత్ ఇండియాలోనే టాప్ హీరోల సరసన చేరిపోయాడు. ఇక దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ పై అభిమానుల అంచనాలు భారీగా పెరిగాయి. తర్వాత చేయబోయే సినిమా ఆర్ఆర్ఆర్ కు మించి హిట్ అవ్వాలని అనుకుంటున్నారు. కాగా, తారక్ తన కెరీర్ లో 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాలతో సినిమా అంటే, నందమూరి అభిమానులకు నచ్చకపోయినా, ఫ్యూరీ ఆఫ్ ఎన్టీఆర్30 అనే పేరుతో వచ్చిన ఫస్ట్ లుక్ కాస్త ఇంట్రెస్ట్ ను పెంచింది.

నిజానికి, ఆచార్య సినిమా ముందు వరకు కొరటాల శివ సక్సెస్ ఫుల్ డైరెక్టరే. కానీ, ఆచార్య సినిమాతో కొరటాల శివ ఇమేజ్ మొత్తం పడిపోయింది. ఈ సినిమా ఫ్లాప్ కావడానికి అనేక కారణాలు ఉండచ్చు. కానీ, దాని ప్రభావం మాత్రం కొరటాలపై గట్టిగానే పడింది. ఎంతలా అంటే, ఎన్టీఆర్30 స్క్రిప్ట్ ను మెరుగుపర్చాలని తారక్ చెప్పేంతలా. ఒకవేళ ఆచార్య హిట్ అయి ఉంటే, ఎన్టీఆర్30 స్క్రిప్ట్ లో తారక్ మార్పులు అడిగే వాడు కాదు.

- Advertisement -

ఏది ఏమైనా, తారక్ సూచనతో కొరటాల ఎన్టీఆర్30 స్క్రిప్ట్ లో మార్పులు చేసే పనిలో ఉన్నాడు. కొన్ని సీన్స్‌ని తొలగించి, కొన్ని కొత్త ఎలివేషన్స్ సీన్స్ జోడిస్తున్నట్టు సమాచారం. దీనికి కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. దీంతో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలైలో షూటింగ్ ప్రారంభం కాకపోవచ్చు. మొత్తంగా ఎన్టీఆర్30 షూటింగ్ మరోసారి వాయిదా పడనుందని అర్థమవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు