Prabhas : సలార్ రెండు పార్ట్స్ నిజమేనా ?

ప్రభాస్ హీరోగా , ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో వస్తోన్న సినిమా సలార్. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి దాదాపు సంవత్సరం దాటింది. ఒకటి రెండు పోస్టర్స్ మినహా సినిమాకి సంబంధించిన టీజర్ గాని ట్రైలర్ గాని రాలేదు.

బాహుబలి సినిమా కోసం అయిదు ఏళ్ళు వెయిట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్, బాహుబలి రిలీజ్ తరువాత ప్రభాస్ వెంట వెంటనే సినిమాలు చేస్తారని అనుకున్నారు. ప్రభాస్ కూడా సంవత్సరానికి 2 సినిమాలు చేస్తానని ఆ మధ్య ఫ్యాన్స్ కి మాట ఇచ్చాడు. కానీ పరిస్థితి చూస్తే అలా లేదు.

రాధే శ్యామ్ సినిమా తరువాత ప్రభాస్ మాట ఇచ్చినట్టుగా వెంట వెంటనే సినిమాలు చేయడం స్టార్ట్ చేసాడు కానీ రిలీజ్ కి మాత్రం ఒక్క సినిమా కూడా లేదు. రిలీజ్ కి పక్కన పెడితే అప్డేట్స్ కూడా లేవు. ఆది పురుష్ సినిమా తప్ప మిగితా ఏ సినిమా కూడా ప్రభాస్ లుక్ ని బయట పెట్టట్లేదు. మారుతీ సినిమా విషయమైతే అసలు ఎవరికీ తెలియకుండనే స్టార్ట్ చేసి, షూటింగ్ కూడా చేసేస్తున్నారు.

- Advertisement -

ఇక సలార్ విషయానికొస్తే, ఈ సినిమా ఒకటే పార్ట్ గా వస్తుందా లేక రెండు పార్ట్ లుగా వస్తుందా అనే డౌట్ ముందు నుంచి ఉంది. కానీ ప్రశాంత్ నీల్ అండ్ మూవీ టీం ఎవరు కూడా దీన్ని అఫీషియల్ గా ఎక్కడ చెప్పట్లేదు. దాంతో ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ మొదలయింది. అయితే కన్ఫ్యూజన్ కి  క్లారిటీ ఇస్తూ దేవరాజు అనే సీనియర్ నటుడు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన సలార్ సినిమాలో నటిస్తున్నట్టు చెప్తూ.. తన పార్ట్ ఎక్కువగా పార్ట్ 2 లో ఉంటుంది అని చెప్పారు. సో సలార్ రెండు పార్ట్లుగా చేస్తుండటం వాళ్ళ సినిమా రిలీజ్ కి లేట్ అవుతుంది అని అందరికి అర్థమైంది. అయితే సలార్ పార్ట్ 1 సెప్టెంబర్ 28 ,2023 లో రిలీజ్ అవనుంది.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు