లవ్ గురు మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రముఖ రచయిత కల్కి రచించిన ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక నవల ఆధారంగా మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ‘పొన్నియిన్ సెల్వన్-1’ సెప్టెంబర్ 30, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో ‘సుందర చోహర్’ పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. త్రిష పాత్ర పేరు ‘కుంధవి’. పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి సంబంధించిన విక్రమ్ ఫస్ట్ లుక్ , కార్తీ ఫస్ట్ లుక్ ను ఇదివరకే చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా ఐశ్వర్యరాయ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది మూవీ టీం. ఐశ్వర్యరాయ్ నందిని పాత్రలో నటిస్తుంది. ‘పొన్నియిన్ సెల్వన్’ స్ట్రీమింగ్ రైట్స్ 125 కోట్లకు అమ్ముడయ్యాయి. థియేట్రికల్ రిలీజ్ తర్వాత అమెజాన్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది.
ఈ చిత్రంలో విక్రమ్‌తో పాటు జయం రవి, కార్తీ, రెహమాన్, ప్రభు, శరత్ కుమార్, జయరామ్, ప్రకాష్ రాజ్, లాల్, విక్రమ్ ప్రభు, పార్తీపన్, బాబు ఆంటోని, అశ్విన్ కాకుమాను, రియాజ్ ఖాన్, త్రిష, శోభితా దూళిపాళ, జయచిత్ర తదితరులు కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.