టాలీవుడ్ లో అనాది కాలంగా వస్తున్న ఆచారం ఫ్యాన్ వార్స్.
ఒక హీరో సినిమా రిలీజైతే మరొక హీరో అభిమానులు ఆ సినిమాని ట్రోల్ చేయడం, డిజాస్టర్ అని పబ్లిసిటీ చేయడం ఎప్పుడు జరిగే విషయమే.
కానీ సోషల్ మీడియా వచ్చాక అది మరీ పెరిగిపోయింది. ఇంతకు ముందు థియేటర్ దగ్గర కట్టే బ్యానర్లో వేరే హీరోపైన సెటైర్లు ఉండేవి.
ఆ సైటర్లు ఇప్పుడు ట్విట్టర్ , వాట్సాప్ స్టేటస్ లలో కనిపిస్తున్నాయి.
చాలా సినిమాల్లో వేరే హీరోల గురించి డైలాగ్స్ పడుతుంటాయి,
వాళ్లను తక్కువ చేస్తూ కొన్ని సీన్స్ కూడా ఉంటాయి. అవి తమ అభిమానులకి ఆనందాన్ని ఇస్తే, వేరే హీరో అభిమానులలో ఆవేశాన్ని నింపుతాయి. ఇలానే ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల మధ్య వార్ స్టార్ట్ అవుతుంది.
అత్తారింటికి దారేది సినిమాలో ” నేను సింహం లాంటోడిని అబ్బా అది గడ్డం గీసుకోదు నేను గీసుకుంటాను అంతే తేడా మిగతాదంతా సేమ్ టూ సేమ్” అని పవన్ కళ్యణ్ చెప్తే. “ప్రతివాడికి సింహాలు , పులులు , ఏనుగులు , ఎలకలతో ఎదవ కంపేరిజన్స్ ఎలపరం వచ్చేస్తుంది” అంటాడు మహేష్ బాబు ఆగడు సినిమాలో. “చరిత్ర అంటే మాది” అంటాడు సింహా సినిమాలో బాలయ్య. చరిత్రలు గురించి చెత్త బుట్టలు గురించి నేను తెలుసుకోను అంటాడు గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్.
అవన్నీ పాత విషయాలు అనుకుంటే, ఇప్పుడు మళ్ళీ ఇలాంటి పరిణామాలే ఎదురవుతున్నాయి.
ఎన్ని సినిమాలు వచ్చిన పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు సినిమాలు రిలీజైనప్పుడు జరిగే హడావిడి వేరు.
రీసెంట్ గా రిలీజైన “భీమ్లా నాయక్” సినిమాలో విలన్ ను ఉద్దేశించి “రిజిస్టర్ అక్కడ ఉంటుంది ప్రతి శుక్రవారం వచ్చి సంతకం పెట్టి పో” అని పవన్ కళ్యాణ్ వైసీపీ కి సెటైర్లు వేస్తే, నిన్న రిలీజైన “సర్కారు వారి పాట” సినిమాలో వైసీపీ డైలాగ్ పెట్టుకుంటూ, పవన్ అభిమానులను తక్కువ చేసేలా కొన్ని సీన్స్ పెట్టారు.
ఈ సినిమాలో సుబ్బరాజ్ పవన్ కళ్యాణ్ అభిమాని. అతని ఫోన్ రింగ్ టోన్ “లా లా భీమ్లా” సాంగ్, ఈ సాంగ్ వచ్చినప్పుడు ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది థియేటర్స్ లో, కానీ ఈ సినిమాలోని ఒక కామెడీ సీన్ లో మహేష్ బాబు సుబ్బరాజు పై ఉ* పోస్తాడు. అందుకే చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులకి ప్రస్తుతం కాలుతుంది. ప్రస్తుతం ట్విట్టర్ లో “సర్కారు వారి పాట” సినిమాపై ఫుల్ నెగెటివ్ టాక్ నడుస్తుంది. అసలు ఆ సినిమా పరిస్థితి ఏంటో ఈ వీకెండ్ ఫినిష్ అయితే అర్ధమవుతుంది.