టాలీవుడ్ లో ప్రస్తుతం సినిమాలు అన్ని ఒకే రకమైన కథాంశంతో తెరకెక్కుతున్నాయి. ప్రేక్షకులను అలరించడానికి కామెడీ ఒక్కటే ఆయుధంగా ఎంచుకుంటున్నారు. కామెడీ డోస్ పెంచడానికి కమెడియన్స్ తో పాటు హీరోలూ సై అంటున్నారు. అందుకు హీరోలకు ఓ లోపాన్ని డైరెక్టర్లు జోడిస్తున్నారు. ఇప్పటికే “రాజా ది గ్రేట్” లో రవితేజ, “రంగస్థలం”లో రామ్ చరణ్ అలానే ఇప్పుడు “ఎఫ్3” లో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కూడా తమకున్న లోపాలతో వినోదాన్ని పండింస్తున్నారు.
కొంత మంది డైరెక్టర్లు ఇంకాస్త ముందడుగు వేసి రోమాంటిక్ యాంగిల్ లో కామెడీ ని పంచడానికి రెడీ అవుతున్నారు. యంగ్ హీరో సంతోష్ శోభన్ “ఏక్ మినీ కథ” సినిమాలో సెక్సువల్ సమస్యతో బాధపడుతున్న ఓ యువకుడి పాత్రలో కనిపించాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన ఈ డిఫరెంట్ కంటెంట్ ఉన్న మూవీని ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించారు. అంతే కాకుండా.. సంతోష్ శోభన్ కు హీరోగా మంచి గుర్తింపు వచ్చింది.
దీని తర్వాత పలువురు హీరోలు ఇలాంటి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీస్ చేయడానికి రెడీ అయ్యారు. అందులో భాగంగానే హీరో నాగ శౌర్య ఈ ప్రయోగాన్ని చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన నటిస్తున్న కృష్ణ వ్రిందా విహారి సినిమాలో హీరోకు అచ్చం ఏక్ మీని కథలో సంతోష్ శోభన్ కు ఉన్న సమస్యే ఉంటుందట. ఈ మూవీ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అంటే సుందరానికి సినిమాను నేచురల్ స్టార్ నాని చేస్తున్న విషయం తెలిసిందే. ఇది రొమాంటిక్, కామెడీ జోనర్ లోనే తెరకెక్కుతుంది. అయితే ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా స్టోరీలో హీరో ఓ సెక్సువల్ సమస్యతో బాధపడే పాత్రలో కనిపిస్తాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఈ లోపంతో వినోదాన్ని పంచడానికి నాని రెడీ అవుతున్నాడట. కాగ ఈ మూవీ వచ్చే నెల 10న రిలీజ్ కాబోతుంది.
ఈ రెండు సినిమాల్లో హీరోలు తమ సమస్యను ఎదుర్కొంటూ, ప్రేమను జయించేలా స్టోరీ ఉంటుందట. ఈ విభిన్న కథాంశంతో వస్తున్న నాని, నాగ శౌర్య సినిమాలు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటాయో తెలియాలంటే,
రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.