OG: ఏం ప్లాన్ చేశావయ్యా సుజీత్ సినిమా రిలీజయ్యే లోపు హైప్ తో సచ్చేలా ఉన్నాం

పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న OG సినిమాపై అంచనాలు ఏ లెవెల్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా వరుస అప్డేట్స్ సినిమాపై అంచనాలను అంతకంతకు పెంచుతూనే ఉన్నాడు ఈ యువ దర్శకుడు.

ప్రభాస్ హీరోగా నటించిన సాహూ సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న సుజీత్. మధ్యలో ఎన్ని పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చిన నో చెప్పి, పవన్ తో సినిమా చేయాలనీ భీష్మించుకుని కూర్చున్నాడు. పవన్ కళ్యాణ్ కథలు వింటున్నడని తెలియగానే వెంటనే పవన్ కళ్యాణ్ కి కథ వినిపించి ప్రాజెక్ట్ లాక్ చేసాడు సుజీత్.

ఇప్పటికే తమిళ్ స్టార్ యాక్టర్స్ అయిన అర్జున్ దాస్, శ్రియ రెడ్డి , బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హస్మీ OG సినిమాలో నటిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా సుజీత్ మరో బాలీవుడ్ బడా యాక్టర్ ని ఓజి సినిమాలో నటించేందుకు ఆయన డేట్స్ కోసం ట్రై చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

ఆ యాక్టర్ ఎవరో కాదు బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఇప్పటికే అమితాబ్ మేనేజర్స్ తో కూడా సుజీత్ టచ్ లో వెళ్లినట్టు టాక్. రాబోయే రెండు, మూడు రోజుల్లో అమితాబ్ ని కలిసి కథ వినిపించి ఎలాగైనా ఓజికి ఎస్ చెప్పించడానికి ప్రయత్నిస్తున్నారట.

ఫ్లాష్ బ్యాక్ లో రాబోయే ఒక పవన్ కళ్యాణ్ చైల్డ్ హుడ్ లో కనిపించబోయే తండ్రి పాత్రకి ఆయనైతే బాగుంటదని అలాగే హిందీలో సినిమా మార్కెట్ కి కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారట. సుజీత్ ప్లాన్ ప్రకారం అమితాబ్ కు గనక ఓజి కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇక సినిమాకి తిరుగుండదు అని ఇండస్ట్రీలో అంత మాట్లాడుకుంటున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు