Pawan Kalyan : దేవి శ్రీ పై కాన్ఫిడెన్స్ తగ్గలేదుగా !

దేవి శ్రీ ప్రసాద్ ఒకప్పుడు రాక్ స్టార్ గా ఓ వెలుగు వెలిగాడు. అతను మ్యూజిక్ అందించిన సినిమాల పాటలు ఒక్కసారి వింటే చాలు ఎక్కేసేవి. ఒక్క తెలుగులోనే కాదు తమిళ్ లో ఎంట్రీ ఇచ్చి, అక్కడి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎ.ఆర్.రెహమాన్, హారిస్ జయరాజ్ లకు చమటలు పట్టించాడు. అందుకే దేవి శ్రీ నే తమ సినిమాలకు సంగీత దర్శకుడిగా ఉండాలని స్టార్ డైరెక్టర్లు, హీరోలు కోరుకునే వారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. పెద్ద సినిమాలకు తమన్ ఫస్ట్ ఛాయిస్ అయిపోయాడు. అందుకు కారణం దేవి శ్రీ ప్రసాద్ ఫామ్లో లేకపోవడం వల్లనే అనేది అందరూ చెప్పే సమాధానం.

సరే ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కు దేవి శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. కానీ, దేవి శ్రీ ప్రసాద్ ను పక్కన పెట్టి తమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోవాలి అని డిస్ట్రిబ్యూటర్ లు, నిర్మాతలు కోరుతున్నారట. ఇదే మేటర్ ను దర్శకనిర్మాతలు పవన్ తో డిస్కస్ చేయగా దేవి నే ఫిక్స్ చేయాలని, అందులో ఎటువంటి మార్పులు వద్దని సూచించారని టాక్. పవన్ కు దేవి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చాడు. ఆయన ఇప్పటికీ అదే నమ్మకంతో ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే దేవి కి కూడా పవన్ అంటే ప్రత్యేకమైన అభిమానం. కాబట్టి కచ్చితంగా భవదీయుడు భగత్ సింగ్ కు మంచి మ్యూజిక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు