Prabhas : డార్లింగ్ పై “పక్కా” ప్రభావం ?

‘సాహో’ మూవీ నెగిటివ్ టాక్ తో సంబంధం లేకుండా ‘బాహుబలి’ క్రేజ్ వల్ల భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కొంతవరకు సంతృప్తి చెందారు. అయితే ఈ ఏడాది వచ్చిన ‘రాధే శ్యామ్’ చిత్రం డార్లింగ్ ఫ్యాన్స్ ను బాగా హర్ట్ చేసింది. అసలు ఇది ప్రభాస్ ఇమేజ్ కు తగ్గ మూవీ కాదు అని అభిమానులే పెదవి విరిచారు. ఇదిలా ఉంటే, గోపీచంద్-మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ‘పక్కా కమర్షియల్’ చిత్రం పై ప్రభాస్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి.

ఒకటి, ప్రభాస్ కు గోపీచంద్ బెస్ట్ ఫ్రెండ్. మరొకటి, డార్లింగ్ తర్వాత చిత్రాన్ని మారుతి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ రెండు కారణాలతో ‘పక్కా కమర్షియల్’ సక్సెస్ కావాలని ప్రభాస్ ఫ్యాన్స్ బలంగా కోరుకున్నారు. కానీ, వారి అంచనాలకు తగ్గట్టు సినిమా లేదు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో కొత్తదనం లేదు. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ‘పక్కా కమర్షియల్’ సినిమా ఏంటి. దాని థీమ్ ఏంటి. ప్రశ్నలకు ప్రమోషన్స్ టైంలోనే మారుతి సమాధానం ఇచ్చాడు.
తాను తీసింది కమర్షియల్ సినిమా. అలాగే ఉంటుందని చెప్పాడు. నిజానికి ఈ సినిమా మారుతి చెప్పినట్టు ఉంది. మారుతికు ఒక సెపరేట్ ఇమేజ్ ఉంది. గోపీచంద్ కు మరో సెపరేట్ ఇమేజ్ ఉంది. ఈ రెండిటినీ మ్యాచ్ చేసి, సినిమా తీసినప్పుడు కొంచెం లాగ్ అనిపించొచ్చు.
ఏది ఏమైనా, పక్క కమర్షియల్ కు వస్తున్న టాక్ ప్రభాస్-మారుతి ప్రాజెక్ట్ పై ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు