Balakrishna: బాలయ్య, వెంకీ, నాగ్, చిరు కలిసి నటించిన వన్ అండ్ ఓన్లీ మూవీ ఇదే

ఇండస్ట్రీలో ఉన్న నలుగురు సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ కు 4 పిల్లర్స్ లాంటివాళ్ళు. వీళ్లంతా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎంత బాగుంటుంది అని తెలుగు సినిమా ప్రియులు ఎన్నోసార్లు ఊహించుకుని ఉంటారు. అయితే ప్రస్తుతం వీళ్ళలో కొంతమంది ఎడమొహం పెడమొహంగా ఉండడం వల్ల అది కుదిరే పని కాదు. అలాగని నిరాశ పడాల్సిన పనిలేదు. ఈ నలుగురు సీనియర్ హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న వన్ అండ్ ఓన్లీ మూవీ ఒకటి ఉంది. అదేంటి అంటే…

యంగ్ స్టర్స్ గా ఉన్నప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మధ్య మంచి ర్యాపో ఉండేది. వీళ్లంతా స్టార్ హీరోలు అయినప్పటికీ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆ సమయంలోనే ఈ నలుగురు హీరోలు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. “త్రిమూర్తులు” అనే సినిమాలో బాలయ్య, వెంకీ, నాగ్, చిరు కలిసి నటించారు. కే మురళీమోహన్ రావు దర్శకత్వంలో రూపొందిన “త్రిమూర్తులు” మూవీ 1987లో రిలీజ్ అయింది. హిందీ బ్లాక్ బస్టర్ మూవీ “నసీబ్”కు రీమేక్ గా వచ్చిన ఈ మూవీని మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై టి సుబ్బిరామి రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించారు. వాస్తవానికి ఈ సినిమాలో వెంకటేష్, అర్జున్, రాజేంద్ర ప్రసాద్ లు హీరోలుగా నటించారు. కానీ ఒక పాటలో మాత్రం టాలీవుడ్ అగ్ర హీరోలు అంతా కలిసి కనిపించడం విశేషం. కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ ఆ పాటలో గెస్టులుగా మెరిశారు. ఇక అలనాటి హీరోయిన్లు విజయశాంతి, భానుప్రియ, రాధిక రాధాతో పాటు చాలామంది హీరోయిన్లు ఆ పాటలో భాగమయ్యారు.

బాలయ్య 40 ఏళ్ల సినీ కెరీర్లో చిరంజీవి, వెంకటేష్, నాగార్జునతో కలిసి కనిపించిన ఒకే ఒక్క మూవీ “త్రిమూర్తులు”. అంతేకాదు బాలయ్య గెస్ట్ పాత్రలో నటించిన ఏకైక మూవీ కూడా ఇదే కావడం విశేషం. అయితే అప్పట్లో భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత ఎప్పుడూ బాలయ్య గెస్ట్ రోల్స్ చేయలేదు. అలాగే మిగతా హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఈ నలుగురు హీరోల్లో బాలయ్య, చిరు మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ నడుస్తోంది. ఇండస్ట్రీకి ఎవరు పెద్ద అనే వాదన కూడా దానికి ఒక కారణం కావచ్చు. ఏదైతేనేం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరోసారి ఈ నలుగురు హీరోలు కలిసి నటించే ఛాన్స్ ఆల్మోస్ట్ లేదనే చెప్పాలి.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు