Ayodhya Ram Mandir: నందమూరి వంశ ప్రతిష్ఠ తారక్ చేతుల్లోనే… అంతా పోగొట్టుకున్న బాలయ్య

NTR vs Balakrishna:  నందమూరి కుటుంబానికి నిజమైన వారసుడు ఎవరు? కొంతమంది బాలయ్య అంటే, మరికొంతమంది తారక్ అంటారు. కానీ నందమూరి వంశ ప్రతిష్ఠను నిలబెట్టగల దమ్ము, ధైర్యం తారక్ కు మాత్రమే ఉంది. బాలకృష్ణ కేవలం వారసుడు అని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తారు. కానీ ఎన్టీఆర్ మాత్రం మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నాడు. నందమూరి కుటుంబ సభ్యులు అంతా కలిసి తారక్ ను అడుగడుగునా అవమానిస్తున్నప్పటికీ, వాటన్నింటినీ దిగమింగుకొని ప్రపంచవ్యాప్తంగా నందమూరి కుటుంబ ప్రతిష్ఠను పెంచే విధంగా తారక్ అడుగులు వేస్తున్నారు. నందమూరి తారక రామారావు మనవడిగా ఆయన కీర్తిని మరింతగా పెంచుతున్నారు.

నిజానికి బాలయ్యతో సహా నందమూరి కుటుంబ సభ్యులు అందరూ తారక్ ను దూరం పెడుతూ వస్తున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద చుట్టుపక్కల ఉన్న తారక్ ఫ్లెక్సీలను తొలగించమంటూ బాలకృష్ణ తన కోపాన్ని వెళ్ళగక్కడంతో వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయం మరోసారి బట్టబయలైంది. అయితే నందమూరి వారసుడిని తానే అని చెప్పుకునే బాలకృష్ణకు కనీసం టాలీవుడ్ లో కూడా సరైన గౌరవం లేదు. సినిమాల పరిస్థితి ఇలా ఉంటే, కనీసం పొలిటికల్ గా కూడా ఈ హీరో స్ట్రాంగ్ గా లేడు. బావ చేతిలో కీలుబొమ్మ అనే ముద్రను వేయించుకుని, ఏదో అలా నడిపిస్తూ వస్తున్నాడు. ఇప్పటిదాకా బాలయ్య తన తండ్రి గౌరవ ప్రతిష్టలు పెంచే విధంగా ఎలాంటి పనులు చేయలేదనీ, కానీ తారక్ మాత్రం బాలయ్యలా కాకుండా తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటూ గ్లోబల్ రేంజ్ లో ఎదుగుతున్నాడనీ అంటున్నారు తారక్ ఫాన్స్.

ఇప్పటికే “ఆర్ఆర్ఆర్” సినిమాతో తారక్ తన తాత కీర్తి ప్రతిష్ఠలను గ్లోబల్ రేంజ్ లో ఎగరవేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని, తన తాతలాగే తారక్ కూడా వాళ్లతో జేజేలు కొట్టించుకుంటున్నారు. దాన్ని ఇంకా ముందుకు తీసుకు వెళ్లేలా సినిమాలు చేస్తున్నారు. ఇక రీల్ లైఫ్ పక్కన పెట్టి రియల్ లైఫ్ లోకి వస్తే… తాజాగా జరిగిన అయోధ్య రామ మందిరం మహోత్సవానికి టాలీవుడ్ లో ఆహ్వానం అందుకున్న అతికొద్ది మందిలో తారక్ ఒకరు. నిజంగా ఇది ఒక అత్యంత అరుదైన గౌరవం. కానీ తారక్ “దేవర” సినిమా షూటింగ్ కారణంగా బాల రామ ప్రాణ ప్రతిష్ట వేడుకకు వెళ్ళలేకపోయాడు.

- Advertisement -

ఇక నందమూరి వారసుడిగా చెప్పుకునే బాలయ్యకు కనీసం ఆహ్వానం కూడా అందకపోవడం చూస్తుంటేనే ఆయన ఏ రేంజ్ లో తన వంశ గౌరవాన్ని నిలబెడుతున్నాడో అర్థమవుతుంది. బాలయ్య సినిమాల్లో తొడలు కొట్టడం, డైలాగులు చెప్పడం తప్ప ఏ విధంగానూ తారక్ కు సాటిరాడు అనేది వాస్తవం. కనీసం టాలీవుడ్లో తన గౌరవాన్ని తాను నిలబెట్టుకోలేని బాలయ్య ఎన్టీఆర్ గౌరవాన్ని ఇంకేం నిలబెడతారు? అంటున్నారు అభిమానులు. కేవలం ఎన్టీఆర్ కొడుకు అన్న కారణం చేతనే బాలయ్యను టాలీవుడ్ ఇంకా భరిస్తోంది అనేది ఫిలిం సర్కిల్స్ లో నడుస్తున్న టాక్. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కూడా నందమూరి వంశ ప్రతిష్ఠను, గౌరవాన్ని నిలబెట్టగలిగేది తారక్ మాత్రమే అని ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు