Neha Shetty: నేహా శెట్టి ఇండస్ట్రీ ఎంట్రీ వెనుక ఇంత కథ ఉందా..?

యంగ్ బ్యూటీ నేహా శెట్టి డీజే టిల్లు సినిమాతో తెలుగులో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. రాధికగా గుర్తిండిపోయేలా తన అద్భుతమైన నటనతో అందరిని అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఇక తన నటనతో ఆకట్టుకున్న ఈమె విశ్వక్ సేన్ సరసన గ్యాంగ్ ఆఫ్ గోదావరితో అలరించనుంది. ఇకపోతే డీజె టిల్లు సినిమా సక్సెస్ తర్వాత తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.. ఇక చివరిగా బెదురులంక 2012 చిత్రంతో ప్రేక్షకులను అలరించిన నేహా శెట్టి.. ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇకపోతే త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడు దగ్గరగా ఉండే నేహా శెట్టి తాజాగా తన గురించి పలు ఆసక్తికర విషయాలను పంచు కుంది.

నేహా శెట్టి హీరోయిన్ గా ఎంట్రీ..
తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. హీరోయిన్గా మారడం వెనుక అసలు విషయాన్ని పంచుకుంది.. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను హీరోయిన్గా మారడానికి ప్రేరేపించిన అంశాలను అలాగే తన కోరికలను వెల్లడించింది.. నేహా శెట్టి మాట్లాడుతూ నాకు చిన్నప్పటినుంచి హీరోయిన్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది.. దాంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లు అయిన ఐశ్వర్యరాయ్ బచ్చన్ , దీపికా పదుకొనే లను ఇన్స్పైర్ గా తీసుకున్నాను.. వారి లాగే మొదట మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత టైటిల్స్ కోసం ప్రయత్నించాను.. ఇక వారిలాగే చిన్నప్పటి నుంచి ప్రతిక్షణం హీరోయిన్ లాగా ఫీల్ అయ్యాను.. అందుకే నేను ఒకసారి వేసుకున్న డ్రెస్ ను మరోసారి వేసుకోలేదు.. ఈ విషయంలో మా అమ్మ నాన్న దగ్గర మొండిగానే ఉన్నాను.. ఆ రోజు అలా పట్టు పట్టడం వల్లే ఈరోజు నేను హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకున్నాను అంటూ తెలిపింది నేహా శెట్టి.. మొత్తానికైతే తాను ఇండస్ట్రీలోకి రావడానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లను ఇన్స్పైర్ గా తీసుకున్నట్లు చెప్పకనే చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

నేహా శెట్టి కెరియర్..
2016లో కన్నడ సినిమా ముంగారు మలే 2 చిత్రంతో సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఈమె తెలుగులో మెహబూబా, గల్లీ రౌడీ ,డీజే టిల్లు సినిమాలలో నటించింది.. అయితే డీజే టిల్లు సినిమాతో సక్సెస్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ..

- Advertisement -

నేహా శెట్టి జీవిత విశేషాలు..
నేహా శెట్టి జీవిత విశేషాలు విషయానికి వస్తే.. కర్ణాటక లోని మంగళూరులో 1999 డిసెంబర్ 6న జన్మించింది. తన విద్యాభ్యాసం మొత్తాన్ని బెంగళూరులో పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ .. తల్లి దంత వైద్యురాలు కాగా.. ఈమె తండ్రి ఒక వ్యాపారవేత్త.. అంతేకాదు నేహా శెట్టికి చెల్లెలు కూడా ఉంది. ఇకపోతే మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. 2014లో మిస్ మంగళూరు అందాల పోటీలో గెలిచి మిస్ సౌత్ ఇండియా 2015 రన్నరప్ గా కూడా నిలిచింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు