Navdeep: ఈసారి నన్ను రేవ్ పార్టీ కేసులో వదిలేసారు.. నవదీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Navdeep: బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించిన విషయాలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పలువురు సినీ నటీనటులు ఉండడం వల్ల ఈ వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా ‌ ఈ సంఘటన పై నవదీప్ స్పందిస్తూ వ్యాఖ్యలు చేశారు.

లవ్ మౌళి ప్రమోషన్స్లో పాల్గొన్న నవదీప్తాను రేవ్ పార్టీ కి వెళ్లినట్లు వార్తలు రాలేదని విషయంపై స్పందించి షాకింగ్ కామెంట్స్ చేశారు.‌ ” నేను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లినట్లు వార్తలు రాకపోవడం వల్ల చాలామంది నిరుత్సాహపడ్డారు. ఎందుకంటే ఎక్కడ ఏ సంఘటన చోటు చేసుకున్న అందులో నా పేరు తప్పనిసరిగా వినిపిస్తుంది కనుక.

కానీ ఈసారి రేవ్ పార్టీ విషయంలో నా పేరు వినిపించలేదు. ఇది కూడా ఒక అందుకు మంచిదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి వాటిల్లో నా పేరు వినిపించకపోవడమే మంచిది ” అంటూ కామెంట్స్ చేశాడు నవదీప్. ప్రజెంట్ నవదీప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నవదీప్ వ్యాఖ్యలు చూసిన పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు