Nani : ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కి మరో ఛాన్స్ ?

నేచురల్ స్టార్ నాని దర్శకులను నమ్మి అవకాశాలు ఇవ్వడు. కథని నమ్మి ఇస్తాడు. నాని మిడ్ రేంజ్ హీరోల్లో టాప్. ఈ నేచురల్ స్టార్ తలుచుకుంటే, టాలీవుడ్ అగ్ర దర్శకులతో సినిమాలు చేసి తన రేంజ్ ను పెంచుకోవచ్చు. నిజానికి నాని వద్దకి చాలా మంది స్టార్ డైరెక్టర్లు కథలు పట్టుకొచ్చిన వారు ఉన్నారు. కానీ నటనకు ఆస్కారం ఉన్న కథలనే ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు నాని. ‘అంటే సుందరానికీ!’ చేసిన వివేక్ ఆత్రేయ కానీ, ‘శ్యామ్ సింగ రాయ్’ చేసిన రాహుల్ కానీ, ఒకటి రెండు సినిమాల అనుభవం ఉన్నవారే ! తనకి ఫ్లాప్ ఇచ్చిన దర్శకులతో కూడా సినిమాలు చేయడానికి వెనుకాడడు నాని. కథ నచ్చాలి అంతే..!

ఇక అసలు విషయానికి వస్తే, నానితో ‘కృష్ణార్జున యుద్ధం’ అనే చిత్రం చేశాడు మేర్లపాక గాంధీ. ఈ సినిమా నిరాశపర్చింది. ఈ సినిమాలో నేచురల్ స్టార్ డబుల్ రోల్ ప్లే చేసినా, అనుకున్నంత రిజల్ట్ రాలేకపోయింది. ఈ సినిమా రిలీజ్ సమయంలోనే, ‘రంగస్థలం’ ‘భరత్ అనే నేను’ లాంటి పెద్ద చిత్రాలు రిలీజ్ కావడంతో సినీ లవర్స్ ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపాలేరు. అయితే మేర్లపాక గాంధీ తెరకెక్కించిన సినిమాల్లో ఇదొక్కటే ప్లాప్. మిగిలినవన్నీ దాదాపు హిట్ చెప్పొచ్చు. అందుకే ఇతనితో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నాని. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన అతి త్వరలోనే వచ్చే అవకాశంముందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు