Bimbisara : సీక్వెల్ లో అన్నదమ్ములు

నందమూరి కళ్యాణ్‌ రామ్ హీరోగా ‘బింబిసార’ అనే చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే విడుదల అయింది. ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ లను సొంతం చేసుకుంటుంది. దర్శకుడు మల్లిడి వశిష్ట్ కు ఇదే మొదటి చిత్రం అయినప్పటికీ, ఇంత గ్రాండ్ గా, మంచి విజువల్స్ తో ట్రైలర్ ను ఎలా కట్ చేశాడా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. వశిష్ట్ ను స్టార్ డైరెక్టర్ గా నిలబెడుతుంది అని అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ. కె ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందించాడు.

ఇక ట్రైలర్ లాంచ్ లో కళ్యాణ్ రామ్ మరో ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు.”నాలుగు రోజుల క్రితం నాకు వశిష్ట్ కు ఓ కథ గురించి డిస్కషన్ జరిగింది. నేను తారక్ తో కలిసి బింబిసార2 నటించాలి అనే దాని పై చర్చ జరుగుతుంది. ‘బింబిసార’ కు పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 3, పార్ట్ 4 కూడా ఉంటుంది. ఇది ఒక ఫ్రాంచైజీలా రూపొందించాలని అనుకుంటున్నాం. 2023 ఆగష్ట్ వరకు పార్ట్ 2 కూడా రిలీజ్ అవుతుంది” అంటూ ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేశాడు. ఇలాంటి చారిత్రాత్మక మరియు ఫాంటసీ చిత్రాలకి ఎన్టీఆర్ కూడా కరెక్ట్ గా సరిపోతాడు.
కళ్యాణ్ రామ్ వ్యాఖ్యలతో బింబిసార 2పై ఇప్పటి నుండే అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు