మారుతి, కామెడీ ట్రాక్ సినిమాలు తెరకెక్కించి, మంచి డైరెక్టర్ గా ఎదిగాడు. ఈ రోజుల్లో సినిమాతో దర్శకుడిగా మారి, సూపర్ హిట్ అందుకున్నాడు. దీని తర్వాత బస్ స్టాప్, కొత్త జంట సినిమాలతో యూత్ ను ఆకర్షించాడు. అలాగే, భలే భలే మగాడివోయ్ చిత్రంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా దగ్గరయ్యాడు. మహానుభావుడు, ప్రతీరోజూ పండగే సినిమాల తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాడు మారుతి. తాజాగా గోపీచంద్ తో పక్కా కమర్షియల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా, మంచి కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమాలో కామెడీ మరియు యాక్షన్ సన్నివేశాలకి పెద్ద పీట వేశాడు.
కాకపోతే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండే టాపిక్స్ మరియు కొన్ని వెబ్ సైట్ లు పేరు చెప్పుకుని మరీ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలని చూసాడు మారుతి. అది అనవసరం అని కొందరి అభిప్రాయం. తన సినిమాలో వెబ్ సైట్ పేర్లు చెప్పించినప్పటికీ, వాటిలో మారుతి గురించి గొప్పగా రాసింది ఏమీ లేదు. మారుతి ఇప్పటికే ఓ స్టార్ డైరెక్టర్ తో సమానం. స్టార్ హీరోలు మారుతితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో మారుతి చాలా హూందాగా ఉండాలి. కానీ, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే బ్యాచ్ ను అడ్డుపెట్టుకుని మరీ విజిల్స్ వేయించుకోవాలా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.