అక్కినేని నాగార్జున 100వ సినిమాకు రంగం సిద్ధమైంది. గెస్ట్ రోల్స్, పక్క భాషల్లో చేసిన చిత్రాలు ఇలా అన్నీ కలుపుకుని నాగ్ 99 సినిమాలు పూర్తిచేశారు. ఇప్పుడు 100వ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. అందు కోసం కొంత మంది డైరెక్టర్ల నుండి కథలు విన్నట్టు తెలుస్తుంది. ఫైనల్ గా, దర్శకుడు మోహన్ రాజా వినిపించిన స్క్రిప్ట్ కు నాగ్ ఇంప్రెస్ అయ్యారట. వెంటనే ఆ స్క్రిప్ట్ ను లాక్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ చిత్రంలో అఖిల్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని టాక్.
మోహన్ రాజా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘గాడ్ ఫాదర్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దసరా కానుకగా విజయదశమి రోజు ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ తో క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమా తర్వాత నాగ్ సినిమాపై మోహన్ రాజా ఫోకస్ పెట్టనున్నాడని తెలుస్తుంది. అక్టోబర్ చివరి వారం లేదా, నవంబర్ లో నాగార్జున – మోహన్ రాజా సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.