Brahmāstra: ఆసక్తికర విషయాలు

రణబీర్ కపూర్ మరియు అలియా భట్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర: పార్ట్ 1 సెప్టెంబర్ 9న విడుదలకు సిద్ధంగా ఉంది. మోడ్రన్ మైథాలజీ గా చెప్పబడుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు అయాన్ ముఖర్జీ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నా వీడియోను బ్రహ్మాస్త టీం విడుదల చేసింది.

అయాన్ ముఖర్జీ అస్త్రార్స్ యొక్క ప్రపంచ సృష్టికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించాడు.”బ్రహ్మాస్త్రం ఒక కల్పిత రచన. ఈ సినిమా ద్వారా భారతీయ ఆధ్యాత్మికతను నాదైన రీతిలో చెప్పాలనే నా ప్రయత్నం. ఈ అత్యంత పవిత్రమైన గురు పౌర్ణమి రోజున, నేను బ్రహ్మాస్త్ర భావన గురించి కొంచెం లోతుగా పంచుకోవాలనుకున్నాను.
అని చెప్పుకొచ్చాడు అయాన్. ఈ సినిమాని తెలుగులో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి రిలీజ్ చేస్తున్నారు.

అయాన్ ఈ చిత్రాన్ని ఎందుకు తీశారు? ఈ బ్రహ్మాస్త్ర అంటే ఏమిటి? ఈ అస్త్రాలు, అస్త్ర వర్స్ అంటే ఏమిటి? ఎలా వచ్చాయి.? అనే వాటిని తన మాటల్లో రివీల్ చేసాడు అయాన్. దర్శకుడు చెప్పిన గొప్ప మాటలతో సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రంలో అమితాబ్ మరియు అక్కినేని నాగార్జున కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు