‘కింగ్’ నాగార్జున హీరోగా ‘గరుడవేగ’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున ఇంటర్పోల్ ఏజెంట్ గా కనిపించనున్నారు. అలాగే నాగ్ కు జోడీగా సోనాల్ చౌహాన్ నటిస్తుంది. ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి’, ‘నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుండి గ్లింప్స్ విడుదలయ్యింది. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
అయితే ఈ చిత్రానికి బిజినెస్ ఇంకా జరగడం లేదు అని ఇన్సైడ్ టాక్. ఏ సినిమాకైనా, గ్లింప్స్, టీజర్ రిలీజ్ అయ్యాక బిజినెస్ స్టార్ట్ అవుతుంది. కానీ ‘ఘోస్ట్’ విషయంలో అలాంటిదేమి జరగడం లేదు. ఈ చిత్రానికి ఇప్పటికే 65 కోట్ల నుండి 70 కోట్ల మధ్య బడ్జెట్ అయినట్టు ఇన్సైడ్ టాక్. ఈ సినిమా నాగార్జున మార్కెట్ కు మించి బడ్జెట్ ఉందని కామెంట్స్ వస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఢమరుఖం సినిమా విషయం లో కూడా ఇదే జరిగింది. ఆ టైంలో నాగ్ మార్కెట్ 20 కోట్లు మాత్రమే ఉండేది. కానీ, 40 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించారు. దీంతో బయ్యర్లకు డబుల్ రేట్లు పెట్టాల్సి వచ్చింది. ఈ సినిమా సమయంలో బయ్యర్లకు, నిర్మాతలకు మధ్య విభేదాలు కూడా వచ్చాయనే టాక్ వినిపించింది. ఈ క్రమంలో నాగార్జున తన పారితోషికంతో కలుపుకుని 20 కోట్లు నష్టపరిహారంగా చెల్లించినట్టు అప్పట్లో తెగ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
మళ్లీ భారీ బడ్జెట్ తో ఇప్పుడు ‘ఘోస్ట్’ సినిమా వస్తుంది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపర్చితే, ఢమరుఖం సీన్ రిపీట్ అయినా ఆశ్చర్యం లేదు అంటున్నారు కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు.