రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం, వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రామిసింగ్ హీరో కొత్త సినిమా “మీటర్” ను అధికారికంగా ప్రకటించారు. రవీంద్ర (బాబీ) మరియు గోపీచంద్ మలినేని దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన తొలి దర్శకుడు రమేష్ కడూరి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
నేడు కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రానికి ‘మీటర్’ అనే టైటిల్ ఖరారు చేయగా, ఫస్ట్ లుక్‌లో కిరణ్ అబ్బవరం మాస్ లుక్‌లో కనిపించారు. ఎ మెజర్ ఆఫ్ ప్యాషన్ అనేది ట్యాగ్‌లైన్. టైటిల్ లోగోపై స్పీడోమీటర్ గమనించవచ్చు.
రంగురంగుల చొక్కా మరియు తెల్లటి టార్న్ జీన్స్‌లో, కిరణ్ మాస్ డ్యాన్స్ స్టెప్ వేస్తూ కనిపించాడు. మోషన్ పోస్టర్‌కి సాయి కార్తీక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. మోషన్ పోస్టర్ , టైటిల్ చూస్తే మీటర్ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది అని అర్ధమవవుతుంది.
మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.