Naga Shaurya: ఆగిన సినిమాలు ?

నాగ శౌర్య టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో ఒకరు. ఆల్రెడీ మూడు, నాలుగు హిట్ సినిమాల్లో నటించాడు. కొన్ని యావరేజ్ సినిమాలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. ఇతను హీరోగా నటించిన కృష్ణ వ్రింద విహారి, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి వంటి చిత్రాలు ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉంది. కానీ ఇంకా రిలీజ్ కాలేదు. షూటింగ్ లు పెండింగ్ లో పడిపోయాయి. అందుకు కరోనా కారణం అని చెప్పారు దర్శక నిర్మాతలు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కృష్ణ వ్రింద విహారి చిత్రం ఏప్రిల్, మే లో విడుదల చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ ఇచ్చారు.కానీ విడుదల కాలేదు.దానికి కారణం ఏంటి అన్నది ఇప్పటి వరకు బయటకి రాలేదు.

ఆర్.ఆర్ కంప్లీట్ అవ్వక లేట్ అయ్యింది అని కొంతమంది అంటున్నారు.. కానీ ఇన్సైడ్ సర్కిల్స్ ప్రకారం ఈ చిత్రం బాగా రాలేదు అని తెలుస్తుంది. ఈ సినిమా కనుక రిలీజ్ అయితే శౌర్య కి మరో ఫ్లాప్ పడే అవకాశాలు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకే రీ షూట్ లు వంటివి చేస్తున్నారు అని ఇన్సైడ్ టాక్. ఇక ఈ చిత్రం వల్ల ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి కూడా షూటింగ్ ఆలస్యం అయ్యింది అని తెలుస్తుంది. అయితే తాజా షెడ్యూల్ ను లండన్ లో కంప్లీట్ చేసినట్టు చిత్ర బృందం తెలిపింది. అవసరాల శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు. ఛలో తర్వాత శౌర్య కి హిట్టు పడలేదు. అందుకే ఈసారి హిట్ పడేలా ఈ చిత్రాల విడుదల ప్లాన్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు